పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3. రెండవ వాటికన్సభ తర్వాత ఆధ్యాత్మికతలో మార్పులు ఆధునిక కాలంలో ప్రజలకు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతూంది. చాలమంది వారి మతాలనే గాక, అన్యమతాల్లోని అంశాలను గూడ తెలిసికోగోరుతున్నారు. పెద్దలే గాక పిన్నలు కూడ ధ్యానం, యోగ, జేన్ సూత్రాల పట్ల ప్రీతి చూపుతున్నారు. ఆధ్యాత్మికతపై పుస్తకాలు పక్రతికలు వెలువడుతున్నాయి. క్రైస్తవ ప్రజలు ప్రార్ధనం ధ్యానం మీద ఎక్కువ శ్రద్ధ, చూపుతున్నారు. దేవుని పేరుమీదిగా సాంఘిక సేవ చేయగోరుతున్నారు. పూర్వకంటే ఎక్కువగా ఇప్పడు బైబులు పఠిస్తున్నారు. హిందూ మతంలో పునరుజ్జీవం కన్పిస్తూంది. అంతటా ప్రార్థనా సమావేశాలు బృందాలూ వెలుస్తున్నాయి. పూర్వం కంటే యొక్కువగా ఇప్పడు నరులు భగవంతుని వైపు దృష్టి మరల్చుతూన్నారు అనిపిస్తూంది. ఇది హర్షించదగిన విషయం. రెండవ వాటికన్ సభ తర్వాత మన క్రైస్తవ ఆధ్యాత్మికతలో కొన్ని మార్పులూ క్రొత్త పద్ధతులూ వచ్చాయి. ప్రస్తుతాని ఈ నూత్న పద్ధతులు ఐదింటిని పరిశీలిద్దాం. 1. పవిత్రాత్మ ఉద్యమం క్రైస్తవ సమాజంలో ఆధునిక కాలంలో కొట్టవచ్చినట్లుగా కన్పించేది పవిత్రాత్మ వుద్యమం. ఇది మొదట పెంటెకోస్టల్ శాఖల్లో పుట్టింది. ఇప్పడు అన్ని క్రైస్తవ శాఖల్లోకి ప్రవేశించింది. క్యాతలిక్ సమాజంలో కూడ ఆత్మపేరిట సభలూ సమావేశాలూ జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో గూడ ఈ వుద్యమం ఊపందుకొంటూ వుంది. వ్యక్తిగతంగా, సామూహికంగా ఆత్మశక్తిని అనుభవానికి తెచ్చుకొని