పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3) ప్రేరణలు పిశాచంనుండి కూడ రావచ్చు. మనలను మోసగించడానికి కొన్నిసార్లు పిశాచంకూడ ప్రేరణలు పుట్టించవచ్చు. వాటిని జాగ్రత్తగా గుర్తించాలి. దీనికి ఆత్మల వివేచనం అవసరం. ఇక్కడ ముఖ్య సుత్రాలు ఇవి 1. మామూలుగా పిశాచం పుణ్యకార్యాలు చేయమని ప్రేరేపించదు. ఆలాంటి ప్రేరణలు పవిత్రాత్మనుండే వస్తాయి. 2. దేవుడు మన అంతస్తుకి చెందని పనులు చేయమని ప్రేరేపించడు. అలాంటి కోరికలు పిశాచంనుండే వస్తాయి. 3. దైవ ప్రేరణల్లో మన ఆత్మ నెమ్మదిగా ప్రశాంతంగా వుంటుంది. పిశాచ ప్రేరణల్లో గజిబిజికి, ఆందోళనకు, చీకటికీ గురైనట్లుగా వుంటుంది. 4. పిశాచ ప్రేరణల్లో పెద్దలకు ఎదురు తిరుగుతాం. దైవప్రేరణల్లో పెద్దలమాట వింటాం. 5. మామూలుగా ప్రేరణం ఎక్కుడి నుండి వచ్చిందో మనమే గుర్తించవచ్చు. సందేహం కలిగినప్పడు పెద్దలను సలహా అడగాలి. 4) ప్రేరణలను పాటించాలి. దైవప్రేరణలు మనం భక్తి మార్గంలో అభివృద్ధి చెందడానికి వస్తాయి. కనుక వాటిని వెంటనే పాటించాలి. లేకపోతే అవి వ్యర్థమైపోతాయి. తన ప్రేరణలను పాటించని వాళ్లకు ఆత్మ కొత్త ప్రేరణలను కలిగించదు. వాళ్లు రోజురోజుకీ దేవునికి దూరమైపోతారు. భక్తుడు ఆత్మకు ప్రార్ధన చేసికోవాలి. దివ్య ప్రేరణలను గుర్తించి వాటిని వెంటనే అమలుపరచే భాగ్యాన్ని దయచేయమని అడుగుకోవాలి. దైవ చిత్తప్రకారం జీవించి పుణ్యమార్గంలో అభివృద్ధి చెందే భాగ్యం కొరకు వేడుకోవాలి. సాధకుడు దేవుని ఆత్మకు సన్నిహితుడుగా మెలగాలి. దేవుని బిడ్డలను దేవుని ఆత్మే నడిపిస్తుంది -రోమా8, 14 L