పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గుర్తించకపోవడానికి కారణాలు అపుణ్యాత్ములకు, పాపాత్ములకూ కూడా ఈ కోరికలు కలుగవచ్చు. ఇవి మన నుండి కాక ఆత్మ వరప్రసాదం నుండి వస్తాయి. ఈ ప్రేరణలు చెడ్డను విడనాడి మంచిని చేయడానికి వుపయోగ పడతాయి. కొన్నిసార్లు ప్రార్ధన చేసికొమ్మనమనో, బైబులు చదువు కొమ్మనమనో, దానధర్మాలు చేయమనో ప్రేరణలు కలుగుతాయి. కొన్ని సార్లు మనం అలవాటు పడిన పలానా దురభ్యాసాన్ని విడనాడిమనో, శత్రువులతో రాజీపడమనో, నోరుపారేసుకో వద్దనో ప్రేరణలు పుడతాయి. మూమూలుగా ఈ ప్రేరణలు నేరుగానో లేక పరోక్షంగానో, అనగా మరొక కార్యంద్వారా రావచ్చు. అనగా ప్రార్ధన చేసికొన్నపుడో లేక మంచి ప్రసంగం విన్నపుడో భక్తిమంతుల సలహాలు పాటించినపుడో ఈ ప్రేరణలు రావచ్చు. ఆత్మ పరోక్షంగా మన హృదయాన్ని కదిలిస్తుంది. ఇవి వర ప్రసాద ప్రభావం వలన కలిగిన మంచి ఆలోచనలు. కనుక మనం వీటిని ఆచరణలో పెట్టాలి. ఐనా చాలమంది వీటిని అట్టే గుర్తించరు. అసలు ఈలాంటి దివ్య ప్రేరణలు వున్నాయని కూడ చాలమందికి తెలియదు. వీటిని గుర్తించి పాటిస్తే ಏುಣ್ಯ సాధనలో అభివృద్ధి చెందుతాం. 2) దైవప్రేరణలను నేక కారణాల వల్ల జనం ఈ ప్రేరణలను గుర్తించరు. కొందరు లోక వ్యామోహల్లో మునిగితేలుతూంటారు. డబ్బుజేసికోవడం పేరు తెచ్చుకోవడం, అధికారం నెరపడం మొదలైనవాటిల్లో పడిపోతారు. కొందరు ఇంద్రియ సుఖాలకు దాసులౌతారు. తినడం, త్రాగడం లైంగిక సుఖాలు అనుభవించడం మొదలైన వాటిల్లో చిక్కుకొంటారు. ఇంకా కొందరిలో అహంకారం, గర్వం బలంగా వుంటాయి. వీళ్లు మొదట నేను తర్వాతనే దేవుడు అన్నట్లుగా ప్రవర్తిస్తారు. ఈలాంటి కారణాలవల్ల జనం దేవుని స్వరాన్ని వినరు. వాళ్ల లోకంలో వాళ్లుంటారు. దైవప్రేరణలు వీళ్లమీద పని చేయవు. L