పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాలపట్టికను ఆత్మగురువు సహాయంతో తయారు చేసికోవడం మంచిది. లేకపోతే ముఖ్యమైన విషయాలను వదలివేయడం, అంత ಮಿಖ೩೦ గాని సంగతులను చేర్చడం మొదలైన ప్రమాదాలు జరుగుతాయి. ఇంకా ఈ కాలపట్టిక మన ప్రాయానికీ, అంతస్తుకీ, వుద్యోగానికీ, బాధ్యతలకు తగినట్లుగా వుండాలి. లేకపోతే దాన్ని పాటించలేం. పైగా అది ఆచరణ విషయంలో అతి కష్టంగాను ఉండకూడదు. అతి సులువుగాను వుండకూడదు. మధ్యస్థంగా వుండాలి. అందుకే ఆత్మగురువు సహాయం అవసరం అని చెప్పాం. ఒకసారి కాల పట్టికను సిద్ధంచేసికొన్నాక దాన్ని ఖండితంగా పాటించాలి. లేకపోతే దానివల్ల ప్రయోజనం వుండదు. పట్టికను సంపూర్ణంగా పాటించాలి. కొన్ని అంశాలను వదలి వేయకూడదు. ఆయా పనులను దేవుని కొరకే చేసి దేవునికే సమర్పించాలి. అప్పడే అవి పవిత్రమైన కార్యాలు అయ్యేది. కాలపట్టిక ప్రకారం జీవితం గడపే సాధకుడు దేవుని మార్గాల్లో నడుస్తాడు. 6. దైవచిత్తంతో ఏకీభవించాలి 1) నరుడు దైవచిత్తనికి లొంగాలి మమూలుగా మన యిష్టప్రకారం మనం జీవిస్తుంటాం. మన కొరికలూ ప్రణాళికలూ మనకుంటాయి. నిత్యం వాటి ప్రకారం పోతుంటాం. దీని వలన పవిత్రత రాదు. మన యిష్టం వచ్చినట్లుగా గాక దేవుని చిత్త ప్రకారం జీవిస్తే పవిత్రత చేకూరుతుంది. కనుక అన్ని విషయాల్లోను మన చిత్తం దేవుని చిత్తంతో ఏకీభవించాలి. పవిత్రత మనంతట మనం సాధించేది కాదు. అది దేవుడిచ్చే వరం. మనం అతనితో సహకరించి పనిచేస్తాం అంతే. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోతే పాపం చేస్తాం.