పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆచరించి చూపించాలి. క్లాసులో పిల్లలు ఒక చెవితో విని ఇంకోచెవితో మరచిపోయినట్లుగా వుండకూడదు. ఆచరణం వలన నరుడు నీతిమంతుడై దేవునికి ప్రీతికలిగిస్తాడు. కేవలం వినడమేనని ఆత్మవంచన చేసికోవద్దు. వినిన దాన్ని ఆచరించాలి -యాకో 1.22 ఆధ్యాత్మిక గ్రంథపఠనం వల్ల చాల లాభాలున్నాయి. కనుక భుక్తుడు ఈ యభ్యాసాన్ని తప్పక అలవర్చు కోవాలి. కోనసాగించుకోవాలి. 5. కాలపట్టిక వుండాలి ఏ పనికైనా కాలపట్టిక వుండాలి. లేకపోతే పనులు సజావుగా జరగవు. ఆధ్యాత్మిక జీవితానికి గూడ ముందుగా కాలపట్టికను తయారు చేసికోవాలి. మఠజీవితం గడిపేవాళ్లను మఠ నియమాలు, మఠశ్రేష్టులు నడిపిస్తుంటారు. కాని గృహస్టులకు ఈ సదుపాయాలు వుండవు. కనుక వాళ్లు ముందుగానే కాలపట్టికను సిద్ధం చేసికొని దాని ప్రకారం ఆధ్యాత్మిక కార్యాలు జరుపుకోవాలి. కాల పట్టిక లేకపోతే ఎంతో సమయం వ్యర్థమైపోతుంది. పనులను సకాలంలో ప్రారంభించం. బద్దకిస్తాం. ఎప్పడు, ఏ పని చేయాలో తెలియదు. మనం ఊహించని అవాంతారాలు వచ్చి పనిని చెడగొడతాయి. కొన్ని సత్కార్యాలు చేయాలనుకొని గూడ సోమరితనంవల్ల చేయం. కొన్ని పనులు అరకొరలుగాచేసి వదలివేస్తాం. ఇన్ని కారణాలవల్ల కాలపట్టిక అవసరమౌతుంది. అది వున్నా కూడ కొన్నిసార్లు పనులు సక్రమంగా జరగవంటే, ఇక అది లేకనేపోతే పనులు సక్రమంగా జరుగుతాయా? మన కాల పట్టికలో ఏయే అంశాలు చేరాలి? పూజ, పాపసంకీర్తనం, బైబులు పఠనం, ప్రార్ధనం, సేవా కార్యక్రమాలు, కరుణకార్యాలు, భక్తిమార్గాలు, పుణ్యక్షేత్ర సందర్శనం మొదలైన ఆధ్యాత్మిక కార్యాలన్నీ ఈ పటికలోకి రావాలి. to