పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నరుణ్ణి పారమార్థిక విషయాలవైపు ఆకర్షించే అద్భుతమైన శక్తి వటుంది. కనుక సాధకులు నిత్యమూ పవిత్రగ్రంథాన్ని చదువుతూండాలి. అర్యశిష్ణుల చరిత్రలు కూడ మంచి ప్రేరణం పుట్టిస్తాయి. ఆ భక్తులు ఈ లోకంలో వొక కాలూ, పరలోకంలో ఇంకో కాలూ మోపి నడక సాగించారు. దివ్యజీవితం గడపడంలో వాళ్లు మనకు ఆదర్శంగా వుంటారు. 8 పుణ్యమూర్తులు మనకు మార్గదర్శకులు, పెద్దన్నలు. బెనడిక్టు, దోమినికు, ఫ్రాన్సిసు, ఇగ్నేప్యసు, బోస్కో డిసేల్సు, చిన్న తెరేసమ్మ మొదలైన భక్తుల చరిత్రలు మన జీవితాల్లో వెలుగును నింపి పెద్దమార్పు తీసికొని వస్తాయి. క్రీస్తు అనుసరణగ్రంథం ఎప్పడూ చదవవలసిందే. అది భక్తికి వూటలాంటింది. ఇంగ్లీషు భాషలో లాగ తెలుగులో ఆధ్యాత్మిక గ్రంధాలు విరివిగా లేవు. ఉన్న వాటినైనా మన ప్రజలు శ్రద్దగా చదువుకోవాలి. మన పుస్తకాలను మనం సేకరించుకొని దాచుకోవాలి. అవకాశం దొరికినప్పడెల్ల చదువుకొంటూండాలి. ఆధ్యాత్మిక గ్రంధాలను వినయ విశ్వాసాలతో చదవాలి. వాటి ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మనం నడవవలసిన మార్గాన్ని చూపిస్తాడు. మంచి ప్రేరణలు పుట్టిస్తాడు. ఆ పుస్తకాలద్వారా దేవుడు ఇప్పడు మనలను ఉద్బోధిస్తాడు -2కొరి 5,20. ఇంకా, మనం పవిత్రులంగా మారడానికి ఈ పుస్తకాలను చదవాలి. వాటిల్లోని సందేశాలను శ్రద్దగా , అవధానంగా అర్థంజేసికోవాలి. వాటిల్లోనుండి ప్రభువే మనలను హెచ్చరిస్తున్నాడు అనుకోవాలి. కీర్తనకారుడు నేను ప్రభువు పలుకులను ఆలిస్తాను అన్నాడు -85,8. బాలుడైన సమూవేలు ప్రభూ! ఆనతి యీయి. నీ దాసుడు ఆలిస్తూనే వున్నాడు అని పల్మాడు -1సమూ 3,10. ఈ పుస్తకాల్లో కన్పించే మంచి సందేశాలను మన జీవితాల్లో ○