పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3) ఈ కోరికకు వుండ వలసిన లక్షణాలు మాములుగా మనం భౌతిక వస్తువులకు అంటిపెట్టికొని వుంటాం. కంటికి కనుపించని దేవుని మీదికి మనసుపోదు. కనుక ఆ ప్రభువే తన వరప్రసాద బలంతో మనలను తనవైపుకు లాగుకొంటాడు. ఈలా పుణ్యసంపూర్ణతను సాధించాలనే కోరికను దేవుడే మనకు ప్రసాదిస్తాడు. అది వరప్రసాద ఫలం, మనంతట మనం సాధించేది కాదు. మనం ఈ వరప్రసాద భాగ్యం కొరకు ప్రార్థించాలి. పరిపూర్ణతను సాధించడంలో చాల ఆటంకాలు వున్నాయి. వీటిల్లో కొన్ని మన నుండే వస్తాయి. కొన్ని యితరుల నుండి వస్తాయి. వరప్రసాద బలంతోనే గాని ఈ యూటంకాలను జయించలేం. పుణ్యార్జనం పట్ల కోరిక మన కోరికలన్నిటిలోను ప్రధానమైనది కావాలి. పవిత్రత మనం సాధించవలసిన వెలలేని ముత్యం అనుకోవాలి - మత్త 13, 46. ఈ కోరిక అంతరాయం లేనిదై వుండాలి. మధ్యలో మళ్లా లోకవస్తువుల్లో పడిపోకూడదు. కొన్నాళ్లయిన తర్వాత ఈ కోరిక సమసిపోకూడదు. పౌలు భక్తుడు నేను ఉత్తీర్ణుడనయ్యానని చెప్పకోవడం లేదు. గతాన్ని మరిచిపోయి ముందున్నదానిని చేరడానికి తీవ్రంగా కృషిచేస్తున్నాను అని పల్కాడు – ఫిలి, 3, 13. ఇంకా యీ కోరిక ఆచరణయోగ్యంగా వుండాలి. మొదట మన బాధ్యతలను నెరవేర్చాలి. మనకు అందుబాటులో వున్న సామాన్య పనులూ చిన్న పనులూ చేసికోవాలి. ఆ మీదట అరుదైన పనులూ, పెద్ద పనులూ చేసికోవచ్చు. చిన్నవాటిని చేయని వాడు పెద్దవాటిని అసలేచేయడు - లూకా 16, 10. పుణ్యపరిపూర్ణతను సాధించ్లడ్డం సులువైన కార్యంకాదు. అది