పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/13

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


మొదటిది, దేవుడు మనకు దయచేసిన నానా భాగ్యాలకు వందనాలు చెప్పకోవాలి. రెండవది, మన పాపాలను గురుకు తెచ్చుకొనే భాగ్యాన్ని దయచేయమని దేవుణ్ణి అడుగుకోవాలి. ఇక్కడ మన తప్పలను సవరించుకొనే వుద్దేశం వుండాలి. మూడవది, రోజు పొడుగున మనం చేసిన తప్పిదాలను జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఇవి తలంపులుగా గాని, మాటలుగాగాని, చేతలుగా గాని వుంటాయి. నాల్గవది, మన పాపాలను క్షమించమని దేవుణ్ణి వేడుకోవాలి. దీనిలో వినయమూ నిజాయతీ వుండాలి. నిజమైన పశ్చాత్తాపం కూడ వుండాలి. ఐదవది, ఈ తప్పిదాలను మళ్లా చేయనని నిశ్చయించుకోవాలి. ఇందుకు దేవుని సహాయాన్ని కూడ అడుగుకోవాలి. రోజు సాయంత్రం నిద్రింపక ముందు ఈ యభ్యాసాన్ని క్రమం తప్పక చేసికోవాలి. దీని వలన మంచిఫలితం కలుగుతుంది. శరీరానికి స్నానం ఏలాగో ఆత్మకు ఈ యభ్యాసం ఆలాగు. దీని వలన రోజు రోజుకి శుద్ధిని పొంది మన నడవడికను సవరించుకొంటాం. దైవసేవలో ముందడుగువేస్తాం. ఇగేష్యసు లొయోలాగారు ఈ యభ్యాసానికి చాల ప్రాముఖ్యమిచ్చి దీన్ని ప్రచారంలోకి తెచ్చారు. అన్యమతస్థులైన గ్రీకు జ్ఞానులు కూడ దీన్ని ఆచరించారు. 3. పుణ్యపరిపూర్ణతను సాధించాలనే కోరిక ఆధ్యాత్మికంగా యెదగాలంటే మొదట ఆ రంగంలో బలమైన కోరిక వుండాలి. ఎవరో భక్తుడు టోమస్ అక్వినాసుగారిని పవిత్రతను సాధించే మార్గమేమిటని ప్రశ్నిస్తే ఆయన సాదించాలని బలంగా కోరుకోవడమే మొదటి మార్గం అని చెప్పారు.