పుట:Adhyatma-Ramayana-Keertanalu.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీమదధ్యాత్మ రామయణకీర్తనలు

బాలకాండము

1. ధన్యాసి - ఆదితాళము

పల్లవి - నమ శ్శివాయ తే నమోభవాయ

అనుపల్లవి. - సమానాధికరహితాయ శాన్తాయ స్వప్రకశా
                  య| ప్రమోదపూర్ణాయ, భక్తౌఘ, పాలనాయ నమ.

గర్వితదానవలోక, ఖణ్డనాయ శ్రీరజత! పర్వతాగ్రనిల
యాయ, పావనాయ! సర్వలోకపాపపుంజ, నిర్వాపణాయశర్వా
య! దర్వీకర భూషణాయ, సర్వోత్తమాయ నమ. 1

అణ్డజాధిపవాహన కాణ్డాయ మేరుశైలకో| దణ్దాయ
శితికఠాయ పండితాయ| మండితత్రిపురజయో, ద్దండతాండ
వాయ బ్రహ్మాండనిలయాయ మహా, మాయాతీతాయ నమ. 2

మందహాసవదనార, విందసుందరాయ యోగి| బృందా
నందదాయ శత్రు భీకరాయ! ఇందుసూర్యాగ్నినేత్రాయ,
నందిత ప్రమథగణాయ! నందివాహనాయ పోషిత, బృందార
కాయ. నమ 3

నిరుపమానందఘన, నిశ్చితాయ శాశ్వతాయ శాశ్వతాయ| వర
దాభయంకరణాయ, గిరిశాయ| తరుణేన్దు శేఖరాయ, పరమ
పురుషాయ భవ| హరణాయశ్రీకాళ, హస్తీశ్వరాయ. నమ. 4