పుట:Abraham Lincoln (Telugu).pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నూతననివాసస్థలము సేరినతరువాత దటస్థించెను. అతడు దనతండ్రికి సాయ మొనర్చుచు నెనిమిదిసంవత్సరములవాడైన దాదిగ మిక్కిలి దేహపరిశ్రమ చేయ దొడంగెను. తదను సరణముగ నతనికాయపుష్టి నానాటికి జెన్ను వహించెను. దేశాధ్యక్షత వహించినతరువాత నొకానొక యంతర్యుద్ధానంతరంబున నొకవైద్యశాలయం దుండిన మూడువేల యుద్ధభటులను జూచి వచ్చుట కతడు వెడలెను. అచట నందఱ క్షేమలాభము లడిగికొని వారికి జేయియిచ్చి గారవించుచుండెను. పరిజను లతనిహస్తము నొచ్చునేమో యని జడసిరి. దానికి బ్రత్యుత్తరముగ నతడు 'నాకష్టములు నను దిట్టడి జేసిన' వని నుడువుచు బని తీరినమీదట బార్శ్వమున బడియున్న గొడ్డలి నొకదాని నందుకొని పదిపదునైదునిమిషము లొక్కుమ్ముడి పెద్దమొద్దును దుత్తునియలుగ నఱకి యాగొడ్డలి నెత్తి కరముతో నొక్క రేఖగ నుండు తెఱంగున నిలిపెను. వణకుడు గొంచవేనియు లేక నెట్టన వ్యాపించిన చేయి బొడ గాంచి చూపరు అత్యద్భుతం బందిరి. ఎట్టి యనువభశాలి యగు వృక్షభేదికి గాని యిట్లొనర్చుట గష్టసాధ్యం బనిన నాబ్రహాము బలము వ్యక్తం బగును,

క్రొత్తయునికి చేరినతోడనే థామసునకు గృహనిర్మాణము గర్తవ్య మాయెను. అతడు తత్కాలమున కొక పందిరి వేసు