పుట:Abraham Lincoln (Telugu).pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాధమును నగు. యునైటెడ్‌స్టేట్సు సంయుక్త ప్రభుత్వమువారు దమ సైనికుల కందఱ కొకవిధమగు సంరక్షణయె యొసంగు చున్నారు. ఇందుకు వ్యతిరేకించి మాశత్రువు లేరినైన రంగు పాపమున దాస్యమున కమ్మిన దానికి దగిన ప్రతికృతి మావశమున నుండు వారి సైనికుల కొనర్తుమనుట గ్రహింపవలసినది. కావున యుద్ధపుచట్టములకు వ్యతిరిక్తముగ మాసైనికు డొకడు చంపబడిన నెదురుసైనికుడొకడు మాచే హతు డగుననుట యెఱుంగునది; మాసైనికుడొకడు దాస్యమున కమ్మబడిన బరసైనికుడు మఱియొకడు మాదేశమునందలి జనోపయోగ కార్యములకు నేమింపబడి మావాడు విడుదల చెందువఱకు గష్టతమవృత్తి నుంచబడు ననుటయు దెలియునది.

ఆబ్రహాములింకను."

లింక నెపుడును గష్టతమంబగు ప్రతికృతి గావింప నొల్లడు. పట్టువడిన సైనికుల బస్తువెట్టి చంపు టతనికి స్వభావ విరుద్ధము. కాని శత్రువులవల్ల జరుగు నాసుర కర్మల గడ తేర్ప మఱొం డుపాయము లేమి లింకను ప్రాణమునకు బ్రాణము గొన సిద్ధపడియెను.

ఒక బానిసవ్యాపారికి నైదుసంవత్సరములు గారాగృహనివాసమును నొక వేయిడాలరుల యపరాధమును విధింప బడియెను. ఆతడు కారాగృహవాసము పూర్తిగ సలిపియుం