పుట:Abraham Lincoln (Telugu).pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"నేటివఱకు మీ కీశ్వరు డాయు వొసంగుటకు నే నెంతయు సంతసించుచున్నాడ" నని లింకను ప్రత్యుత్తర మిచ్చెను.

"మీ గుణంబుల నెంతయు మెచ్చితిని. ఇదివఱకుం గల దేశాధ్యక్షులలో మీర యుత్తములని" యా వృద్ధనారి లింకనునకు దన మనంబు వెల్లడిసేసెను.

"మీజాతి విముక్తిగుఱించి తల పెట్టుచున్నారు గా బోలు" నని దేశాధ్యక్షుడు ప్రతిపల్కెను.

తరువాత నొక యఱగంటకాలము లింక నామెతో సంభాషణ సల్పెను. ఆమె కతడు సూపిన మర్యాదయు స్నేహమును నాపట్టణమందలి స్వేత స్త్రీలలో నుత్తమురాలికైనను జూపియుండ డనిన నతిశయోక్తి గానేరదు.

ఫ్రెడరిక్కు డగ్లసను ముక్తబానిస యొకరుడు వాషింగ్టనున కేతెంచెను. ఆసంగతి విని లింక నతని బసకు దనబండినంపి "వచ్చి నా గృహమున దేనీళ్లు స్వీకరించి పోవలె" నని * వేడెను. డగ్ల సా యాథిత్య మంగీకరించె దేశాధ్యక్షుని గేహమునకు నల్లమానిసి విందారగింప నేతెంచిన దిదియ ప్రథమతరుణము. లింకను దన యతిథి నతిగారవమున ______________________________________________________________

  • మనము భోజనమునకు బిలిచి గౌరవించు తెఱంగున నిది పాశ్చాత్యులలో నొక గౌరవసూచక సాంప్రదాయము.