పుట:Abraham Lincoln (Telugu).pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషయమే నాకు జ్ఞాపక ముండలేదు. అయిన నాపెను గాంచినతక్షణమ లింక నామెవార్తనంతయు విని "అమ్మా! నీవు వేరుగ న న్నడుగుట యనవసరము. నీకు గావలసినవస్తువు నీ కిప్పించెద. నీద్వితీయపుత్రుని సైన్యమునుండి విడిపించెద" నని యుత్తరువు లిఖింపజొచ్చెను.

అత డట్లు వ్రాయుచుండ నావృద్ధురాలు దల్లికుమారుంబోలె లింకను దల నిమురుచు నశ్రువుల రాల్చుచుండెను. లింకను ముగించి యార్ద్రచక్షువులతో గద్గదస్వనంబున "నిదె కొమ్ము. నిలచినయిరువురలో నీ కొక్కడును నా కొక్కం డును నయ్యె" ననుచు బత్ర మందిచ్చెను. ఆయవ్వ దానింబుచ్చుకొని కనుల నీళ్లు నిలిపి మరల నొకమా రతని శిరంబుదడవి "నాయనా! లింకను! దేవుడు నీకు మేలు సేయుగాత. నీవు చిరాయు వగుదువుగాక. నీవె యెల్లపు డీరాష్ట్రధిపత్యము వహింతువుగాక" యని దీవించిపోయెను.

ఒకానొక సైనికుడు మూడుమాఱులు సేనవిడిచి పాఱిపోయియుండెను. ఒక తూరి రక్షకభటుల గొందఱిని విషము పెట్టి చంప బ్రయత్నించెను. కావున వాని నురిదీయవలసినదిగా దండనవిధించి యురిదీయబడుటకు నతని గారాగృహమునందుంచిరి. అయిన నతడుచేసిన కార్యము లున్మాదజనితములని సీమప్రతినిధి హారిసునకు దెలియవచ్చెను. కార్యదర్శి