వినియోగము:—
| స్నేహారమ్భే తథాయత్నే సమ్యగర్థే ౽పిచ స్మృతౌ. | 181 |
| సరసత్వేనుమోదేచ సా గ్రీవా సుందరీ మతా, | |
తా. స్నేహారంభము, యత్నము చేయుట, మంచిదనుట, తలఁచుట, సరసము, అనుమోదము వీనియందు ఈ గ్రీవ యుపయోగింపఁబడును.
2. తిరశ్చీనము:—
| పార్శ్వద్వయోర్ధ్వభాగే తు చలనాత్సర్పయానవత్. | 182 |
| సాగ్రీవాతు తిరశ్చీనేత్యుచ్యతే నాట్యకోవిదైః, | |
తా. ఇరుప్రక్కల నూర్ధ్వభాగములయందు సర్పగతివలెఁ గదలిక గలది తిరశ్చీనగ్రీవ యనఁబడును.
వినియోగము:—
| ఖడ్గభ్రమే సర్పగత్యాం తిరశ్చీనానిగద్యతే. | 183 |
తా. కత్తిని ద్రిప్పుటయందును, పామునడకయందును ఈ గ్రీవ వినియోగించును.
3. పరివర్తితము:—
| సవ్యాపసవ్యచలితా గ్రీవా యత్రా౽ర్ధచంద్రవత్, | 184 |
తా. వామదక్షిణములకు అర్ధచంద్రాకారముగా కదలింపఁబడునది పరివర్తితగ్రీవ యనఁబడును.
వినియోగము:—
| శృంగారనటనే కాంతా కపోలపరిచుమ్బనే, | 185 |