వినియోగము:—
| జుగుప్సాయాం విస్మయేచ అసూయామాం భవేదసౌ, | |
తా. ఇది రోఁతపడుటయందును, ఆశ్చర్యమందును, ఓర్వనితనమందును చెల్లును.
3. ఉత్క్షిప్తము:—
| ఏకావాసా ద్వితీయావా యదుత్క్షిప్తతీతరామ్, | 175 |
| ఉత్క్షిప్తాసాభవేత్ స్త్రీణాం కోపే సత్యవచస్యసి, | 176 |
తా. కనుబొమ్మలు రెంటియందును ఒక్కటిగాని రెండుగాని మిక్కిలి నిక్కింపఁబడునేని అది ఉత్క్షిప్తభ్రు వనఁబడును. ఇది స్త్రీలకోపమునందును, సత్యవచనమునందును, శృంగారభావమందును, లీలయందును వినియోగింపఁబడును.
4. చతుర:—
| ద్వితీయసహితా స్తోకా స్ఫురితామదమంథరా, | 177 |
తా. రెండుకనుబొమ్మలకూడికతో కొంచెము మెల్లగా చలింపఁజేయఁబడియెనేని చతురభ్రు వగును. ఇది ముఖము తాఁకుట, మనస్సంతోషము, వేగిరపాటు వీనియందు ఉపయోగింపఁబడును.
5. రేచితము:—
| లావణ్యమధురాక్షిప్తా యద్వేకారేచితామతా, | |
తా. అందముగాను ఇంపుగాను ఒక కనుబొమ్మ వంపఁబడునేని అది రేచితభ్రు వనఁబడును.