తా. ధ్వజముకొన, గోపురము, దేవమండపము, పూర్వజన్మము, పొడుగు వెన్నెల మొదలగువానియందు ఈ దృష్టి వినియోగింపఁబడును.
7. అనువృత్తము:—
| ఊర్ధ్వాధో వీక్షణం వేగా దనువృత్తనిరీక్షణమ్, | |
తా. వడిగ క్రిందుమీఁదుగాఁ జూచునట్టిచూపు అనువృత్త మనఁబడును.
వినియోగము:—
| కోపదృష్టౌ ప్రియామన్త్రే౽ప్యనువృత్తనిరీక్షణమ్. | 119 |
తా. కోపముతోఁ జూచుట, ప్రీతితోఁ బిలుచుట వీనియందు ఈదృష్టి వినియోగించును.
8. అవలోకితము:—
| అధస్తాద్దర్శనం యత్త దవలోకితముచ్యతే, | |
తా. క్రిందుచూచెడిచూపు అవలోకిత మనఁబడును.
వినియోగము:—
| ఛాయాలోకే విచారేచ శయ్యాయాం పఠనక్రమే. | 120 |
| స్వాఙ్ఞావలోకనే యానే౽ప్యవలోకితముచ్యతే, | |
తా. నీడను చూచుట, విచారము, శయనము, చదువుట, తన యవయవములను జూచుకొనుట, నడక వీనియందు ఈ దృష్టి వినియోగింపఁబడును.
గ్రన్థాన్తరస్థదృష్టిభేదాః
| సమాప్రలోకితా స్నిగ్ధా శృంగారో ల్లోకితా౽ద్భుతా. | 121 |
| కరుణా విస్మయాదృప్తా విషణ్ణా చ భయానకా, | 122 |