పుట:Abhinaya darpanamu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వినియోగము:—

కస్తూర్యాం కిఞ్చిదప్యర్థే స్వర్ణతామ్రాదిలోహకే,
ఆర్ద్రేఖేదేరసాస్వాదే లోచనే వర్ణభేదకే.

364


ప్రమాణే సరసే మందగమనే శకలీకృతే,
ఆసనే ఘృతతైలాదౌ యుజ్యతే చతురఃకరః.

365

తా. కస్తూరి, కొంచె మనుట, బంగారు రాగి మొదలగులోహములు, తడి, భేదము, రసాస్వాదము, కన్ను, వర్ణభేదము, ప్రమాణము, సారస్యము, మెల్లగ నడచుట, తునుక, ఎత్తుపీఁట, నేయి నూనె మొదలగుద్రవ్యవస్తువులు వీనియందు ఈహస్తము వినియోగించును.

గ్రంథాంతరస్థచతురహస్తలక్షణమ్

యత్రా౽౦గుష్ఠః పతాకస్య మధ్యమామధ్యపర్వగః,
కనిష్ఠికా బహిర్యాతా చతురంతం కరంవిదుః.

366


అమృతం హర్తుమనసమాత్మాను మతికాంక్షిణమ్,
సుధాంహ రేతి హ స్తేనగరుడమ్ప్రతిజల్పతః.

367


కాశ్యపాచ్చతురోజాతః వాలఖిల్యో మహాఋషిః,
చిత్రవర్ణో మిశ్రజాతిః వైనతేయశ్చ దేవతా.

368

తా. పతాకహస్తమునందలి అంగుష్ఠమును నడిమివ్రేలి నడిమిగణుపునందు పొందించి చిటికెనవ్రేలిని బయట చాఁచిపట్టఁబడినది చతురహస్త మనఁబడును. ఇది పూర్వకాలమునందు అమృతమును హరించుటకై తనయభిమతము నపేక్షించు గరుత్మంతునికి సుధను హరింపుమని హస్తముచేత జాడ చూపిన కశ్యపునివలనఁ బుట్టెను. ఇది మిశ్రజాతి. దీనికి వాలఖిల్యుఁడు ఋషి . చిత్రవర్ణము. వైనతేయుఁడు దేవత.