పుట:Abhinaya darpanamu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క్షీరోధిజః కాలకూటః గుళి కాకృతికఃపురా,
లాఙ్గూలో హరసఞ్జాతో ఋషిః క్రౌఞ్చవిదారణః.

351


సిద్ధజాతి స్వర్ణవర్ణః పద్మా తస్యా౽ధిదేవతా,

తా. నడిమివ్రేలు, బొటనవ్రేలు, చూపుడువ్రేలు దీనిని టెంకాయకన్నులతీరున నిలిపి ఉంగరపువ్రేలిని వంచి, చిటికెనవ్రేలిని పైకెత్తిపట్టిన లాంగూలహస్త మగును. ఈహస్తము పూర్వకాలమునందు పాలసముద్రమునందుఁ బుట్టిన కాలకూటవిషమును మ్రింగుటకై శివుఁడు గుళికగాఁ జేసిన పట్టినపుడు శివునివలనఁ బుట్టినది. దీనికి ఋషి కుమారస్వామి. సిద్ధజాతి. బంగారువన్నె. అధిదేవత లక్ష్మి.

వినియోగము:—

ద్రాక్షాఫలేచ రుద్రాక్షే చుబుకగ్రహణే౽పిచ.

352


కుచప్రరోహే క్రముకే కిఙ్కిణ్యాముత్పలే ఫలే,
విద్రుమేచ మితగ్రాసే నక్షత్రే బదరీఫలే.

353


వర్తులాయాం మల్లికాదౌ చకోరే ఛాతకే౽ల్పకే,
కరకాయాం సిద్ధజాతౌ హరీతక్యాం సువర్ణకే.

354


ఏవమాదిషుయుజ్యేత హస్తోలాఙ్గూలసంజ్ఞకః,

తా.. ద్రాక్షపండు, రుద్రాక్ష, గడ్డము పట్టుకొనుట, మొలకచన్ను, పోక, చిరుగజ్జెలు, కలువ, పండు, పగడము, కొద్దిపాటికబళము, నక్షత్రము, రేగుపండ్లు, వట్రువ, మల్లెపువ్వు, చకోరపక్షి, చాతకపక్షి, ఆల్పవస్తువు, వడగల్లు, సిద్ధజాతి, కరకకాయ, బంగారు ఇవి మొదలగువానియందు ఈహస్తము వినియోగించును.