పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/177

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
163
సావిత్రీబాయి ఠాణేకరీణ్.

ఇట్లామె మూడువేలసైనికులను లక్ష్యముచేయక రెండుజాముల సంగ్రామములో వారిలో ననేకులను జంపియుఁ గొందఱిని పాఱఁగొట్టియుఁ గోటాద్వారములను దెఱచెను. దీనింగని దాదోజీ మిగులదిగులొంది యింకను గొన్నివేలసైన్యమును దెచ్చి యామెను చుట్టుముట్టెను. అప్పుడును నామె ధైర్యమును విడువక శత్రుసైన్యములతోడఁ బోరి తన శౌర్యము నందఱకును విదితపఱపుచుండెను. ఆసమయమునం దామె ధైనికులుకొంచె మధైర్యపడిన ట్లగుపడఁగా వెంటనే యామె ముందుకువచ్చి తన మెడలోని హారములను దెంపి సైనికులకు బహుమానములిచ్చి వారి కుత్సాహము కలిగించెను. అందువలన వారు మిగుల శౌర్యముతోడఁ బోరి యుద్ధమునఁబడిరి. తదనంతరము దాదోజీ యేడెనిమిదివేలసైనికులతోడ నామెను ముట్టడించి యామెవెనుకకుఁ బోయి యామె గుఱ్ఱపుకాలిని నఱికెను. అందువలన నామెక్రిందికి రావలసినదాయెను. ఆమె క్రిందదిగినవెంటనే యామె కుడిచేతిని దాదోజీ నఱికెను. అంతతో నాచెయ్యి ఖడ్గముతోఁగూడ ధరణిపైఁ బడియెను. అప్పుడు చేయి పోయినందునకంటెను చేతిలోని ఖడ్గముపోయినందున కే సావిత్రీబాయి కధిక దు:ఖము కలిగెను. తదనంతర మాయన యాకిల్లాపైని శివాజీ పతాకమును నాటి విజయమునుచాటి యచటినుండి సావిత్రీబాయిని దనతోఁ దీసికొని శివాజీ కోలాపురమునం దుండఁగా నచటికివచ్చెను. అచట దాదోజీసావిత్రీ బాయి ధైర్యస్థైర్యములను, యుద్ధవిశారదత్వమును శౌర్యమును, ధృఢనిశ్చయమును మొదలగు గుణములను చాలవర్ణించెను. వానిని విని శివాజీమిగుల