పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/37

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మయిన చర్చలు సాగాయి. ఆండీ ముఖం వుద్రేకంతో మెరిసిపోతున్నది. ఓహో! ఆ దారపుకండెల తొట్టెదగ్గిర నుంచి దూరంగా వెళ్ళిపోవటం! అతడికి ఏవో నూతన ప్రపంచద్వారాలు తన కోసం వితృతాలైనట్లు తోచింది. కానీ అతని తండ్రి మాత్రం అనుమానిస్తున్నాడు.

"ఆండా ఎంత చిన్నవాడో మిస్టర్ బ్రూక్స్‌కు తెలిసి వుండ" దని అతడు అడ్డుపెట్టాడు. "ఆండు యిస్తానన్న జీతాన్ని బట్టి ఇంతకంటే వయసున పెద్దవాడు బలిష్ఠుడు అయిన కుర్రవాడు కావలెనని అతడు వుద్దేశించి వుంటాడు.

"ఆండీ వయసున చిన్నవాడె. కానీ అసాధారణమైన చురుకుతనం వున్న వాడని నేను అతడికి వివరించి చెప్పాను" అన్నాడు. అంకుల్ టాయ్ "అతడు ఇంతకంటే పెద్దవాడు కావలెనని వుద్దేశించ లేదు ఆండీ అతడికి సంతృప్తిని కలిగించ గలడని నా విశ్వాసం".

మిస్టర్ కార్నెగీ తల ఊపాడు. "థామస్ ! నీవు ఇందులోని మంచి చెడ్డల నన్నిటిని ఆలోచించినట్లు లేదు. అతణ్ని నానారకాలైన స్థలాలకు పంపిస్తుంటారు. అందులో కొన్ని కుర్రవాళ్లు వెళ్ళదగ్గవిగా వుండవు. వార్తలను చేతికిచ్చి చీకటి రాత్రుల్లో బయటికి పంపించవచ్చు. బహుశ: గ్రామసీమలకు కూడా పంపించవచ్చు అంతే కాదు. మొదట అతనికి ఈమహానగరమే సరిగా తెలియదు" అన్నాడు నొక్కి పలుకుతూ.