పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రేలుడు కలిగి లోపల వున్న జనమంతా సమాధి చెయ్యబడ్డారు. ఆ గనికి పూర్వపు సూపరింటెండెంటు మిష్టర్ టైలర్. ఇతడు ప్రస్తుతం మరొక వ్యాపారంలోకి వెళ్ళాడు. ఆ గనిని గురించి తనకున్న జ్ఞానం, అనుభవం ఎందుకైనా ఉపకరిస్తుందన్న ఆశతో అతివేగంగా ఆ దృశ్యం జరిగిన చోటికి వెళ్లాడు. అతడు నాయకత్వానికి పే రెన్నిక గన్న వాడు. ఆదుర్దాతో చుట్టూ మూగిన వాలంటర్లును చేర్చుకొని నాయకత్వం వహించి అతడు గనిలోనికి దారితీశాడు. వాళ్లు మృతి జెందకుండా అనేకమందిని బయటకు తీసి బ్రతికింప గలిగారు. కాని ధీరుడయిన టైలర్ మాత్రం ఆ చర్యలో తన ప్రాణాలను కోల్పోయినాడు.

మిత్రులకోసం తన ప్రాణాలను అర్పించిన ఈ వ్యక్తి కంటె ప్రేమ మరెవ్వరిలో అధికంగా వుండి వుండదు. యీ వాక్యం ఈ విషాద సంఘటన తరువాత చిర కాలం వరకూ కార్నెగీ మనస్సులో మారుమ్రోగుతుంది. గొప్ప సమయములో ఈ హిరోఫండు పుట్టింది. అతడు తరువాత ఇలా వ్రాశాడు. "నాకు దానిమీద పితృ ప్రేమ వుంది. ఎందువల్ల నంటే ఇది నాకు ఎవరూ సూచించింది కాదు. నాకు తెలిసినంతవరకూ దీన్ని గురించి ఎవరూ సూచించటం జరగ లేదు. నిశ్చయంగా ఇది నా మేధాప్రియ పుత్రిక.

ఇది యుద్ధ సమయంలోని వీరవరులకు, వీరనారీమణులకు కాకుండా శాంతి సమయంలోని వీర స్త్రీ పురుషులకు ఉద్దేశింపబడటం వల్ల దీని గుణాధిక్యాన్ని గురించి కొందరు