పుట:Aandhrashaasanasabhyulu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దొండా శ్రీరామమూర్తి


బొత్స ఆదినారాయణ

ప్రజాసోషలిస్టు : భోగాపురం నియోజకవర్గం, జననం: 1924, విద్య: యస్. యస్. యల్. సి., 1942 ఉద్యమములో 4 నెలలు జైలుశిక్ష. 1947 లో కాంగ్రెస్ నుండి రాజీనామా చేసి ప్రజాపార్టీలో చేరిక. జిల్లా ప్రజా సోషలిస్టు పార్టీ కార్యవర్గ సభ్యుడు. ప్రత్యేక అభిమానం: వైద్యం. అడ్రస్సు: దాసన్న పేట, విజయనగరం పోస్టు.

రుత్తల లత్సాపాత్రుడు


అంకితం వెంకట భానోజీరావు

కాంగ్రెస్ : విశాఖపట్టణం నియోజకవర్గం, అనేక సంవత్సరాలుగా విశాఖపట్టణం మునిసిపల్ ఛైర్మన్, విశాఖపట్టణం ఎ. వి. యన్. కాలేజీ, అనేక ప్రజాహిత సంస్థలలో సభ్యుడు. అడ్రస్సు : విశాఖపట్టణం.

గొట్టెముక్కల జగన్నాధరాజు

ప్రజా సోషలిస్టు : భీముని పట్టణం, నియోజకవర్గం, జననం, 1888. విద్య, బి. ఎ. బి. యల్. 27 సం|| లు జిల్లా బోర్డు అధ్యక్షుడు, 4 సం|| లు మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు. 10 సం|| లు జిల్లా ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధ్యక్షుడు, యుద్ధానంతర పునర్ నిర్మాణ సంఘం, సభ్యుడు. అడ్రస్సు : డాబా గార్డెన్సు, విశాఖపట్నం.