పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుఁఆన్‌చ్వాంగ్‌ వర్ణించిన ఆంధ్రదేశము

రికిని దాసుడనని యంగీకరింపలేదు. కాని మత విషయమున మాత్రము, విచక్షణ లేకుండ, నేది యెవ్వరు చెప్పినను, మూఢవిశ్వాసముతో విశ్వసించుచుండెను. అందువలననే యాతని గ్రంథమునందు చారిత్రక జ్ఙానము గాని, వివేచనగాని, పరిశీలనగాని గాన్పించదు.

యుఁఆన్‌ చ్వాంగ్‌ రచించిన సీ-యూ-కీ గ్రంథమిపుడు మనవ్యాసరచనకు ముఖ్యాధారము. ఆపదమునకు "పశ్చిమ దేశమునందలి బుద్ధునికి సంబంధిన వృత్తాంతము" లని యర్థము. ఈ గ్రంథమును యుఁఆన్‌ చ్వాంగ్‌ చెప్పుచుండ, ఫీ౯షీ యను పండితుడు వ్రాసియుండెనని కొందఱి యభిప్రాయము. మరి కొందఱు, అతడు మన యాత్రికుడు వ్రాసిన దానిని నచ్చటచట సంస్కరించి వ్యాఖ్యానము చేయుచు వచ్చెనని చెప్పుదురు. ఇందేది వాస్తమయినను, యుఁఆ౯ చ్వాంగ్‌ వ్రాసినట్లు చెప్పెడి గ్రంధమునందనేక పాఠాంతరములున్నవి. అనేకములు తప్పులున్నవి. ఈకాలమున చీనా సారస్వతమునందు సి-యూ-కీ అమూల్యమైనదిగా పరిగణింప బడుచు, పాశ్చాత్య ఖండపు భాషలన్నిటిలోనికి భాషాంతరము చేయబడియున్నది. ఈగ్రంథమును బీలు పండితుఁ డాంగ్ల భాష లోనికిఁదెచ్చెను. అతని భాషాంతరీకరణమును, జూలియను పరాంసు భాషాంతరీకరణమును, సంప్రదించి, వాటర్సు పండితుడు గ్రంథము నంతయు తిరిగి వాఖ్యతో వ్రాసెను.