పుట:Aandhra-vaang-maya-suuchika.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

శ్రీధర వేంకటేశ కేతకరుగారు ప్రచురించిన మహారాష్ట్రీయ వాఙ్మయ సూచిని సూచినపుడు ఆంధ్రవాఙ్మయసూచిని బ్రచురింపవలయునను సంకల్పము గలిగినది. కీర్తిశేషులైన కొమ్మర్రాజు వేంకట లక్ష్మణరావు గారు నా సంకల్పముతో నే కీభవించిరి. సాధనసామగ్రిని సమకూర్చుట కుపక్రమించితిమి. చెన్నపురియందుఁ గాని ఆంధ్రదేశమునందుఁగాని సమగ్రమైన యాంధ్ర గ్రంధ భాండారము లేదు. ప్రాచ్యలిఖిత పుస్తకభాండారమునందును, సాహిత్యపరిషత్పుస్తక భాండారమునందును, తంజావూరు పుస్తకభాండారమునందును అముద్రితగ్రంధములప్రతు లున్నను ముద్రితములైన గ్రంధములప్రతులు గాని, పట్టికల గాని సమగ్రమైనవి యెచ్చటను గనుబడవు. ముద్రితగ్రంధముల పట్టికలుగల ఫోర్టు సెయింటు జార్జి గెజెట్టులప్రతులును నులువదేండ్ల కంటెను బ్రాచీనమైనవి లేవు. పుస్తకముల రిజిస్ట్రారు కార్యాలయమునందైనను సమగ్రమైన పుస్తకముల పట్టికగాని, పుస్తకసముదాయము గాని కనపడదు. గౌతమీ గ్రంధాలయమునందును రామమొహన గ్రంధాలయమునందును కొన్ని ముద్రితాముద్రిత గ్రంధములు మాత్రము గలవు. ఆంధ్రదేశమునకు కేంద్రస్థానము లేకుండుటయే ఈదురవస్థకుఁ గారణము. ఒక కేంద్రస్ధానముండిన సమగ్రమైన గ్రంధసముదాయము సమీకరింపబడియుండును. తమిళప్రాల్యముగల మద్రాసునందాంధ్ర గ్రంధసమీకరణము దుర్లభము. ఆంధ్ర గ్రంధములను సేకరించి రక్షించినభాగ్య మారంభమునదు బ్రౌనుగారికిఁ గలిగినది. ఆనిష్కామ భాషాభిమాని ఆంధ్రులకు బూజా పాత్రుఁడు. ఇట్టి క్లిష్టపరిస్థితులం దాంధ్ర వాఙ్మయసూచిని సిద్ధముచేయుటయందుఁగల సాధకబాధకములను విజ్ఞులు గ్రహింపగలరు.

అత్యంతపరిమితమైన సాధనసామగ్రితో సమకూర్పఁబడిన ఆంధ్రవాఙ్మయసూచి అసమగ్రముగను, దోషభూయిష్ఠముగను నుండుట సహజము. లభ్యములైన సాధనసామగ్రిని సమకూర్చిసంకల్పమును నసమగ్రముగనైను గార్యరూపమున మాతృభాషాపూజకు సమర్పింపఁ గలిగినందులకు భగవంతునకును, సహచరులకును, సహకారులకును, గృతజ్ఞుడను.

ఆంధ్రవాఙ్మయము:

ఆంద్ర వాఙ్మయము చిరకాలసంవర్ధితమై యవిచ్ఛిన్నముగ వర్ధిలుచున్నది. వాఙ్మయవికాసపరిణామమునకు బ్రజాజీవన వికాసపరిణామము లాధారములుగ నున్నవి. ప్రజాజీవనమునందు గోచర మగు వృద్ధిక్షయములు వాఙ్మయ చరిత్రమునందు గోచరించు చుండును. రాజకీయవిజయములు. సాంఘిక పరివర్తనములు, మత మీమాంసలు