Jump to content

పుట:Aananda-Mathamu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

ఆనందమఠము

తుడిచికొనిరి. అయినను, కన్నీరు మున్నీరుగాఁ బ్రవహించుచునే యుండెను. కొంత సేపటికి తమకుఁ దామే శాంతి నొందిరి. కల్యాణి, భోజన ప్రస్తావము చేసెను. బ్రహ్మచారి యనుచరుండొకఁడు భక్ష్యముల నొకతట్టయందిడి తెచ్చెను. దానింగైకొనుమని కల్యాణి భర్తతోఁ జెప్పెను. దుర్భిక్ష కాలము కనుక అన్న వ్యంజనాదులు దొరకుట లేదు. అయినను సంతానులకు మాత్రము దొరకుచుండెను. లేని వస్తువు లెవరికిని దొరకవు. ఆయరణ్యము సాధారణజనులకు అగమ్య మైనది. ఏ చెట్టునందేకాయ కాచినను ఎప్పుడు పండినను అన్నమునకు లేనివారు దానిని గోసి తినివేయుదురు. ఈయడవిచెట్లలోని కాయలును పండ్లును ఇతరులకు లభ్యము కావు. బ్రహ్మచారి కొన్ని దినుసుల పండ్లును కొంచెము పాలును తెచ్చియిచ్చి వెడలిపోయెను. సంతానులకు పాడియావులు చాలాకలవు. కల్యాణి పలువిధములుగా వేఁడుకొన్నందుమీఁద మహేంద్రుడు కొన్ని పండ్లను దినెను. భుక్తావశేషమును గల్యాణి వేఱొక ప్రదేశమునందు కూరుచుండి భుజించెను. అనంతర మిరువురును నిద్రించి శ్రమమును పరిహారము చేసికొనిరి. మేల్కొన్న తర్వాత ఇర్వురును ఎచ్చటికిఁ బోవలయునో దానిని గూర్చి యాలోచించిరి. ‘కల్యాణి, మనము గృహమునం దున్న యెడల విపత్తు కల్గునని యెంచి గృహత్యాగము సేసివచ్చితిమి, ఇపుడు చూడఁగా ఇంటికంటే బైటనే విపత్తు లధికముగా నున్నవి. మఱల ఇంటికే పోదము’ అనెను. మహేంద్రునికిని అదే యభిప్రాయముండెను. వాఁడు కల్యాణిని ఇంటియం దుంచి సంరక్షించుటకుఁ దగిన మనుష్యులను నియమించి, పరమరమణీయ