పుట:Aananda-Mathamu.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

237

నలుబదియైదవ ప్రకరణము


సత్యానంద——శక్తి లేకుండినచో నిచ్చటనే నీమాతృ ప్రతిమ యొక్క సాన్ని ధ్యముననే 'దేహత్యాగము చేసెదను.

మహాపురుష——ఇట్లు చేయుట అజ్ఞానము చేతనే ! నడువుము. జ్ఞానలాభమును బడయుము. హిమాలయశిఖరంబున మాతృమందిర మున్నది. అచ్చటనే మాతృమూర్తిని నీకుఁ జూపించెదను,

ఇట్లని చెప్పి, ఆమహాపురుషుఁడు. సత్యానందుని చేయి పట్టుకొనియెను. ఏమి యపూర్వమైన శోభాకాంతి ! ఆ గంభీరమైన విష్ణుమందిరమున నా ప్రకాండ మండిత చతుర్భుజమూర్తి యొక్క సముఖంబున, బ్రాహ్మముహూర్తమున వెన్నెల వెలుంగున మహాప్రతిభాపూర్ణు లగు నిరువురు పురుషమూర్తులును ఒకరు మఱియొకరి చేతినిపట్టుకొని నిలిచిరి, ఎవరు ఎవరినిఁ బట్టు కొనియున్నారు? జ్ఞానము భక్తి చేతిని బట్టికొని యున్నట్లును, ధర్మము కర్మము చేతినిఁ బట్టికొని యున్నట్లును, నివృత్తి ప్రవృత్తి చేతినిఁ బట్టుకొని యున్నట్లును, కల్యాణి శాంతి చేతినిఁ బట్టికొని యున్నట్లును నుండెను. ఈసత్యానందుఁడే శాంతి; ఈమహా పురుషుఁడే కల్యాణి; సత్యానందుఁడే ప్రవృత్తి, ఈమహాపురుషుఁడే నివృత్తి. నివృత్తి ప్రవృత్తినిఁ దోడ్కొని పోయెను.

సమాప్తము

చెన్నపురి: వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స వారి ' వావిళ్ల ' ప్రెస్సున ముద్రికము, 1948