నలుబదిమూఁడవప్రకరణము
225
ఱును మనస్సున సంతానులకు జయ మాయెను, శత్రువులను బాఱఁద్రోలి వచ్చుచున్నారని తెలిసికొని ‘కొట్టుఁడు, శత్రువులను నఱుకుఁడు’ అని శబ్దము చేయుచు మరల నింగ్లీషువారి సైన్యముపైఁ బడిరి.
ఇచ్చట ఇంగ్లీషువారి సైన్యమునందు కలత కల్గెను. సిపాయీలు యుద్ధ ప్రయత్నమును మాని రెండు వైపులకు బాఱుచుండిరి. ఆంగ్లేయులు సహితము తుపాకులను దించుకొని శిబిరాభిముఖులై పాఱిరి. మహేంద్రుఁ డట్టిటు చూచుచుండఁగనే పర్వతశిఖరమందనంతమైన సంతాన సైన్యమును గాంచెను. వారు వీరదర్పముతో దిగివచ్చుచు ఇంగ్లీషువారి సైన్యమును నాక్రమించుచుండిరి. మహేంద్రుఁ డెలుఁగెత్తి సంతానులను గూర్చి “సంతానులారా! అట చూడుఁడు; పర్వత శిఖరంబున ప్రభువు సత్యానందగోస్వామి ధ్వజము కానఁబడు చున్నది. నేడు స్వయముగా మురారి యైన మధుకైటభ నిషూదనుఁడగు కంసకేశి రణక్షేత్రమున వచ్చి యున్నాఁడు! పర్వతముపై లక్షసంతానులున్నారు ‘హరే మురారే! హరే మురారే!’ యని చెప్పుడు. లెండు; లేచి శత్రువుల ఱొమ్ము పగులునట్లు కొట్టుఁడు. లక్ష సంతానులు పర్వతముపై నున్నారు” అని చెప్పెను.
అప్పుడు ‘హరేమురారే’ అనెడి భీషణధ్వని పర్వతకందరకానన ప్రాంతర మెల్ల నిండి నిబిడీకృత మాయెను. సకల సంతానులయొక్క “మాభైః మాభైః ” (భయమువద్దు భయమువద్దు) అను రవము లలితమైన తాళధ్వనియై, తళతళ మెఱయ నస్త్రముల ఝుణంఝుణ శబ్దమునందు లయముకాఁగా సర్వజీవము