18
ఆనందమఠము
లేదు. వానికి ఏదియు తోఁపలేదు, జీవచ్ఛవమువలె యట్లే నేలపై పరుండినాఁడు.
మూఁడవ ప్రకరణము
కల్యాణి తప్పించుకొనుట
దొంగలు కల్యాణిని ఎత్తుకొనిపోయి విడిచినవనము మిగులమనోహరమై యుండెను. వెలుతురు చొర వీలులేని స్థితిలో నుండెను. అరణ్యశృంగారమును వీక్షించుటకు వేయి కన్ను లైనచాలవు. దరిద్రుని హృదయాంతర్గతమైన సౌందర్యమువలె, ఆవనసౌందర్యము అదృష్టమైనదిగ నుండెను. చూచినవారే లేరు. గ్రామములలో ధాన్యము లేకపోయినను వనమునందు మాత్రము పుష్పము లుండెను. పుష్పము లాయంధకారమునందు వెన్నెలవలె నుండెను. దొంగలు, కల్యాణిని దానికూఁతును కోమలమైన తృణశయ్యయందు పరుండఁజేసి, యందఱు పరివేష్టించి కూర్చుండి పరస్పరము మాటలాడఁ దొడంగిరి. కొంద ‘ఱీమెను దీసికొనిపోయి యేమి చేయవలయును?’ అనిరి. అంతలోఁ గొందఱు ‘ఈమెయొద్దనుండు నగలను ముందే తీసికొనియైన’ దనిరి. మఱికొందఱు ‘దాని నంతయు భాగించుకొనవలయు’ ననిరి. అట్లే భాగించికొనిరి. ఒక దొంగ ‘వెండి బంగార మెందులకు? ఎంతటి మంచినగ లిచ్చినను నొక పిడికెడు కూడు దొరకుట లేదు. ఆఁకలిచే ప్రాణము పోవుచున్నది. ఈదినము ఆకులను తింటిని. నాకు నగ లేల?’ అనెను.