Jump to content

పుట:Aananda-Mathamu.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

186

ఆనందమఠము

మైన ఫిరంగీల శ్రేణి సప్తదశముఖములనుండి హేదొర యొక్క దళమునం దగ్నివృష్టిని గురియించుచుండెను. ఆఘోరశబ్ద ముచే వన నద గిరు లన్నియు ప్రతిధ్వనితము లాయెను. పగలంతయు రణమున శ్రమపడిన యవనసైన్యము ప్రాణభయముచే వడవడ వడంకెను. ఆయగ్ని వృష్టి చే ముసల్మానులు, హిందూస్థాను లందఱును పలాయన సూక్తపరాయణు లగుచుండిరి. కేవలము నలుగురు ఎఱ్ఱమూతివారు మాత్రము చక్కఁగా నిలిచి మరణమునకు సిద్ధులైరి. భవానందుఁ డీవినోదమును చూచుచు, “భ్రాతృలారా! తురకలు భగ్నులై పరుగిడుచున్నారు; పదండి, వారిని వెన్నఁటుద” మనియెను.

అప్పుడు సంతానులు పిపీలికా ప్రవాహమువలె నూతనోత్సాహముచే నానకట్టనుండి వెనుకకుఁ దిరిగివచ్చి యవనుల నాక్రమించుటకై పరుగిడిరి. అకసాత్తుగా వారు యవనులపైఁ బడిరి; యవనులకు మరల యుద్ధంబున కవకాశము దొరక లేదు. భాగీరథీతరంగ మేలాగున దంభ కారియు, మహాపర్వతాకారముననైన మత్తగజమును దేలించుచు తీసికొనిపోవునో, ఆలాగున సంతానులు యవనులను దేల్చికొని పోయిరి. యవనుల వెనుక భాగమున భవానందుని కాల్బల ముండెను. ముందు భాగమున మహేంద్రుని ఫిరంగిగుండ్లుండెను. అప్పుడు హేదొరకు సర్వనాశముసంభవించెను. ఇంకేమియు మిగుల లేదు. బలము వీర్యము సాహసము కౌశలము శిక్ష దంభము అన్నియు పోయెను, ఫౌజుదారీ, పాదుషాహి, ఇంగిలీషు, దేశి, విలాయతి, నల్లవారు, ఎఱ్ఱవారు, అందఱును నిపాతమై నేలం బడిపోయిరి. విధర్ముల సైన్యము పలాయనమై పోయెను.