136
ఆనందమఠము
బులలోని యిండ్లు పాడుపడి పశుపక్షులకు విశ్రామభూమియై ప్రేతభీతికిఁ గారణమాయెను. పంటభూములను సాగుబడి చేయువారు లేక, బీడుపడి గడ్డి పెరిఁగి యుండెను. దేశమంతయు కాననమువలెఁ గన్పట్టెను. ఎచ్చట శ్యామలకోమలమగు సస్య రాశి ప్రకాశించుచుండునో; ఎచ్చట అసంఖ్యాకములగు పశుపక్షులు మేయుచుండునో; ఎయ్యది గ్రామమందుండు యువకయువతులు గుంపు చేరి యామోద ప్రమోదంబులఁ జేయుచుండిన యుద్యానభూములుగా నుండునో; అవియన్నియు ఘోరతరమైన వనంబగుచు వచ్చెను. ఒక యేఁడు కడచెను; రెండేండ్లు చెల్లెను, మూఁడేండ్లాయెను. కాననము మఱింత వృద్ధియగుచు వచ్చెను. ఏస్థలము మనుష్యుని సుఖంబున కాటపట్టై యుండెనో యది నరమాంస లోలుపమైన వ్యాఘ్రాదులకు వాస స్థలమాయెను. ఎచ్చట సుందరీమణులు గుంపు చేరి యలకాంకిత చరణంబులయందలి గజ్జెలు, పిల్లాండ్లు, గొలుసులు, మెట్టులు ఈ మొదలగు నాభరణములు ఘల్లు ఘల్లున శబ్దము చేయఁగా నెచ్చెలులతో సరససల్లాపము లాడుచు పకపక నవ్వుచుఁ బోవుచుండిరో యాస్థలములయందు భల్లూకములు బిలంబులను ద్రవ్వికొని పిల్లలను కని లాలన పాలన చేయ నారంభించెను. ఎచ్చట పిన్నవాండ్రు పిన్న వయసున సంధ్యాకాల మల్లికా కుసుమమువలె ఉత్ఫుల్లహృదయులై యాటపాటలఁ బొద్దు పుచ్చుచు సంచరించుచుండిరో యాస్థలములయందు మత్తగజంబులు చెట్ల కొమ్మలను లాగుచుఁ దిరుగుచుండెను. ఎచ్చట దుర్గోత్సవములు జరుగుచుండెనో యచ్చట సృగాలావాస