పుట:A Collection of Telugu Proverbs translat(1).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రలోకోక్తిచంద్రికాశేషము.


TELUGU PROVERBS,

SUPPLEMENT.

అ.

2135. అంగటి వీధిలో ఆలిని పడుకోబెట్టి వచ్చేవారు పొయ్యేవారు దాటిపోయినారు అన్నట్టు.

Having put his wife to bed in the Bazaar street, he complained that the comers and goers stepped over her.

2136. అంటక ముట్టక దేవరకు పెట్టుతున్నాను, ఆశపడకండి బిడ్డలారా అవతలికి పొండి అన్నదట.

Without touching or handling I offer it to the deity, don't wish for it O children ! Be off !

                       (See No. 490.)

2137. అంతమాత్రం వుంటే, దొంతులతో కాపరం చెయ్యనా.

If I had so much, would I not live with piles of pots !

2138. అందని పూలు దేవునికి అర్పణ.

An offering to the deity of the flowers which cannot be reached.

                             (See No. 768.)

2139. అందరికీ శకునము చెప్పే బల్లి కుడితితోట్టెలో పడ్డట్టు.

The lizard which tells the fortunes of all fell itself into the tub of rice-washings.

The sound of the lizard is believed to be auspicious or ominous according to the quarter from whence it is heard, the hour, &c.