పుట:2030020025431 - chitra leikhanamu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఊదాగను ఉండును. కొందఱిముఖములను ఎఱుపుతో విస్తారము చిత్రింపవలసియుండును. విస్తారము నల్లగనుండు ముఖములయందు న్యూట్రల్‌టింటును, నీలిని, వేండిక్కుబ్రౌనును, బరంటుశయనాను వేయవలసియుండును.

తెలుపురంగు, లేసును, ముత్యములను, బంగారపువస్తువును చిత్రించుటకు పనికివచ్చును. ఏమైనతప్పులను దిద్దుకొనుట కీరంగు మిగుల నుపయోగపడును. కాని కొంచెమే యుపయోగింతురు. ఇదివరకు వేసినరంగు లేమైన కనబడకుండునటుల చేయవలయు నన్న నారంగులపై దీనిని దట్టముగ వేసిన చాలును.

కన్ను:- పెదవులును, కన్నులును, భావమును తెలియజేయును. మనుజుల నాకర్షించును. ముఖమున కివియే సౌందర్యము నొడగూర్చును. పెదవులకంటె కన్నులెక్కువముఖ్యమని నా యుద్దేశము. ఇట్టియవయవముల విషయమై కొంచెము నేర్చుకొనుట మంచిది. వీటిరూపు వయస్సునుబట్టి మారుచుండును. బాలురకండ్లు గుండ్రముగ నుండును. వయస్సు ఎక్కువైనకొలది గుండ్రము తగ్గుచుండును. మగవారికండ్లు జ్ఞానముతో నిండియుండును. కొంచెము మోటుగ నుండును. స్త్రీల వన్ననో, మృదువుగను, ప్రకాశముగ నుండి యొకవిధ మైనకరుణరసమును ప్రదర్శించుచుండును. విచారముగను, సంతోషముగను నుండుసమయమునం దీకన్నులదృష్టులు వివిధాకృతులను దాల్చుచుండును. వీటిద్వారా నిట్టిభావమును చూపుట మిక్కిలికష్టము. ఇట్టిసమయములయందు పురుషులకండ్లను కొంతవఱకు చిత్రింపవచ్చును. కాని స్త్రీలకండ్లను వ్రాయుట కష్టము. కొంచెము కొంచెము కదలిపోయిన యెడల భావమంతయు నశించును. అందువలన ప్రారంభమునందు విద్యార్థులు మిగులజాగ్రత్తగ నుందురుగాక!

స్త్రీలకండ్లయందు ప్రకాశమును కనుబఱుపవలెను. అందువలన ఛాయను, వివరములను చూపవలసియుండును. ఇది అన్నిటికంటెను కష్టము. కండ్లను చిత్రించునపుడు కొన్నిగీతలను విడిచివేయవచ్చును. భావమున కనుగుణముగ నుండుగీతలను మాత్రము విడిచిపెట్టుటకు వీలుండదు. ఇటులచేసినయెడల చిత్రమంతయు నశించును.

నొసటిమీద వెలుతురు పడుచున్నటులైన కొన్నిసమయములయందు నయనములు ఛాయచే కప్పబడి యుండును. ఇట్టిసమయమునందు వీటిని చిత్రించుట కొంచెము సులభమే. రోగులయొక్కయు, వృద్ధుల యొక్కయు, కండ్లు కొంచెము లోతుగ నుండును. అందువలన నీకండ్లపై ఛాయ దట్టముగ నుండును కాన వీటినిగూడ చిత్రించుట అంతకష్టము కాదు. కాని వృద్ధులకండ్లయందు వార్ధక్యమును, రోగులకండ్లయందు రోగమును చూపవలసి యుండును.

అన్నిస్థలములకంటె కండ్లవద్ద విస్తారము ఛాయయుండును. కాని యిది అన్నిఛాయలతోను కలసియుండి ముఖముయొక్క రూపమును పాడుచేయదు.

నల్లనిముఖముయొక్క కనుబొమలు సాధారణముగ నల్లగనుండును. కాని వీటిని అంతనల్లగ ప్రదర్శింప వీలుండదు. వీటిఅంచులు దట్టముగ నుండక గ్రేవర్ణముగ నుండును. మధ్యను మాత్రము నలుపును వేయవలెను. ఈవిషయమై నలుపును, లేక నలుపును, ఎఱుపును పసుపుపచ్చను ఉపయోగించెదరు. ముసలివారి కనుబొమలు మిగుల ఎత్తుగ నుండును. కొన్నిసమయములయందు పండిపోవును. రాలిపోవును. మఱికొన్ని సమయములందు విస్తారము దట్టముగ పెరుగును. ఇతరసమయములం దచ్చటఛ్ఛటమాత్రము రాలిపోవును. కనురెప్పవెండ్రుకలవిషయమై యేమియు చెప్పుటకు వీలులేదు. ఇవి వంకరగనుండును. క్రొత్తవారు వీటిని విస్తారము దట్టముగ చిత్రించెదరు. ఈ అభ్యాసమునుండి తప్పించుకొనవలెను.

కంటిలోపలిమూలయందు ఎఱ్ఱనిమాంసపుకండ కానవచ్చుచుండును. దీనిని చిత్రించుట కెంతయైనజాగ్రత్త కావలసియుండును. కంటిక్రింద నున్నచర్మము మిగుల పలుచగనుండును. ఛాయచే కప్పబడి యుండును. దీనికి గ్రేవర్ణమును ఊదాను వేసెదరు. ముసలికాలమునం దీరంగులు ఆకుపచ్చగ మాఱుచుండును.

నోరు:- కన్నులవలెనే వయసునుబట్టి దీనియాకారము మాఱుచుండును. బాల్యమునం దిది గుండ్రముగగను,