పుట:2016-17 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులపై సిఎజి నివేదిక.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆధ్యాయం - రాష్ట్రప్రభుత్వ ఆర్థిక స్థితిగతులు



1.5 రాష్ట్ర వనరులు

1.5.1 వార్షిక ఆర్థిక పద్దుల ప్రకారం రాష్ట్ర వనరులు

ప్రజాపద్దులోకి నికరంగా వచ్చే రాబడులు కాక రెవెన్యూ, క్యాపిటల్ అనే రెండు రకాల రాబడుల ద్వారా రాష్ట్రానికి వనరులు సమకూరుతాయి. పన్నుల వసూళ్ళు, పన్నేతర రాబడులు, కేంద్ర పన్నులు-సుంకాల్లో రాష్ట్ర వాటాగా వచ్చిన నిధులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహాయక గ్రాంట్లు-రెవెన్యూ రాబడుల్లో ఉంటాయి. క్యాపిటల్ రాబడుల్లో-పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వచ్చే మొత్తాలు, లోన్లు-అడ్వాన్సుల రికవరీలు, అంతర్గత వనరుల (మార్కెటు లోన్లు, ఆర్థిక సంస్థలు/వాణిజ్య బ్యాంకుల నుండి తీసుకున్న అప్పులు) ద్వారా వచ్చిన రాబడులు, కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకున్న లోన్లు, అడ్వాన్సులు వంటి వివిధ క్యాపిటల్ రాబడులు ఉంటాయి. చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు, భవిష్య నిధి, రిజర్వు నీధి జమలు, అనామతు పద్దు, జమలు మొదలైన వాటినుండి చెల్లింపులు పోగా ప్రభుత్వ వినియోగానికి అందుబాటులో ఉన్న మిగిలిన మొత్తాన్ని ప్రజాపద్దులో నికర నిధులుగా పరిగణించడం జరుగుతుంది. రాష్ట్ర వనరుల్లోని అంశాలు, ఉప అంశాలను ఈ క్రింది ఫ్లోర్టులో చూపడమైంది:

సూచిక. క్యాపిటల్ రాబడులలో వేస్ ఆండ్ మీన్స్ ఆడ్వాన్సులు/ ప్రత్యేకంగా డ్రా చేసే సదుపాయం/ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా ఉపయోగించుకున్న ? 29,154 కోట్లను కలుపలేదు

2016-17 సంవత్సరంలో రాష్ట్రం మొత్తం వనరులు 1,39,304 కోట్లు కాగా, అందులో రెవెన్యూ రాబడులు (98,984 కోట్లు) 71.06 శాతం, క్యాపిటల్ రాబడులు (32,798 కోట్లు) 23.54 శాతం, ప్రజాపద్దులోకి నికర రాబడులు (7,522 కోట్లు) 5.40 శాతం చొప్పున ఉన్నాయి. 2012-17 మధ్య కాలంలో రాష్ట్ర మొత్తం వనరుల్లో వివిధ అంశాల విలువను చార్టు 1.2లోనూ, ప్రస్తుత సంవత్సరం (2016-17) రాష్ట్ర మొత్తం రాబడుల్లో వివిధ అంశాల కూర్పును చార్టు 1.3లోనూ చూపడమైంది. పేజి 5