పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము 68

సంస్కృత వ్యాఖ్య రచించినాఁడు. దీని కహోబలపండితీయ మని పేరు. చిన్నయసూరికి ముందుకాలమున పై గ్రంథములన్నియు ప్రామాణికముగ సంగీకృతములై బహుళ ప్రచారములో నున్నవి. ఇవికాక 'వాసుదేవ వృత్తి', 'వైకృతి చంద్రిక' మున్నగు సంస్కృత వ్యాకరణములు తెనుఁగునకుఁ గలవు.

ఆంగ్ల భాషామయ వ్యాకరణములు

సంస్కృతాంధ్ర భాషలలోనున్న వ్యాకరణములు కేవలము తెనుఁగు పండితు లగువారికి, నితరులకు దుర్గ్రాహ్యము లగుటంజేసి యాంగ్లేయుల పరిపాలనా ప్రారంభమున సులభ శైలిలో వ్యాకరణములు రచించుచు వచ్చిరి. దీనికి దారి చూపినవారు కంపెనీవారి కాలమునందలి ఇంగ్లీషు ఉద్యోగస్థులే. వారిలో Carey (క్యేరి), Campbell (క్యాంపుబెల్ - కాంబెల్), Brown (బ్రౌను) అనువారు ముఖ్యులు. వీరి వ్యాకరణములు ముద్రితములై యాకాలమున ప్రథమముగా తెనుఁగు వ్యాకరణము నభ్యసించువారి కుపయుక్తములై యొప్పారుచుండెడివి. కాని యిందలి భాష వ్యావహారికము. వీరి వ్యాకరణములు వ్యవహార భాషకేకాని కవిప్రయుక్తమైన గ్రాంథికమునకుఁగాదు. కావున నివి మిక్కిలి సంకుచిత ప్రయోజనము గలవియై వ్యాకరణాభ్యాస పాటవమును పెంపొందింప లేకపోయినవి.

ప్రభుత్వమువారు ఫోర్టుసెంటుజార్జి కోటలో తెనుఁగు నేర్పుటకు ప్రసిద్ధులగు సంస్కృతాంధ్రపండితులను నియమించిరి. వారును వ్యాకరణ రచనమునందుమాత్రము సులభ