పుట:2015.396258.Vyasavali.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
70

వ్యాసావళి.

మిన్నకుండుదమ; కొరయాలి కోఱడము పాలు గానెల? తెనుగు వారలొన నిద్దఱ కొకడేని జదువకుండిన బోదు మొఱటుపేరు. మన తెన్గు వారిలో బార్లెదరయ్య? నూర్వురుకు మువ్వుర! వారిలో నేని జదువగ రరిది. వ్రాబల్క నుండి కడుగడిది; గఱవంగ బట్టదందఱకు.

    మనలోన మిన్నలు నోటను బల్కీన పల్కులు మొఱటనుట మన పిచ్చిగాదె? వారాడు మాటల మన మాడెదమ కాదె! వారాడుమాటల మనకు వ్రాయంగ గాదు గాకేమనియు గాఱు లొక్కొ? తొలుదొల్త దెన్నాటి  కాపుల పలుకుల గయితిమ్ము గూర్పంగ దొడగి యపుడు మొఱటులోకాక యవి సొక్కంపునడలో! యది మీకుదోపదె? తలపోయుడేల యీఱతాఱ తలంపుల బీఱవాఱ? బాపల మున్నుగా మాటలు పుట్టించి కమ్మనై గివ్వగా దెనుగయ్యెనయ్య బాపల కంటెను ముందర గాపులు పల్కరె ప్రాతలు దెనుగ నుడులు? దొంటిపెద్దల కట్టి యరమన లున్నె? తొంటి కాపు పలుక కొనియాడ రైరె? యేనాటి పెద్దల నుడుల నానాడు మేలు? నెన్నుటయ పాది యెల్లెడల? నీనాటి తెలుగులలొ నందు బెద్దల గడువింత గదురంగ దమనుడులు దార మొఱటని పూనిక నట్టి రట్టె తమ బాస లెస్సయ యనుడు, గడుగిన్క నదియేమొ కీడుగా మది జిత్తగించి కయ్యమ్మునకు గాలుద్రువ్వుచున్నారు! నగుదునో, వగతునో, యోయమ్మ చెల్ల! పేరొలగమ్మున రాజులు ప్రెగడలు మాటాడు మాటలును మొఱటలగునె? రచ్చతిన్నియలలో నంగళ్ళరొను దీర్పరుల మాటలును మొఱటుల యగునె? "భారత"కత సదివి విప్పి వినుపించు నాయయ్య మాటలును మొఱటు లన జన్నె? ప్రోలి పెద్దల మాట లని మొఱటులయ్యు తెనుగు జదువుల రచ్చ దీర్పరులరె? యన్నిట మిన్నలు, నుడి  యటె