పుట:2015.393685.Umar-Kayyam.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

183

719

అల మహాకల్మషుఁడు కషాయాంబరుండు
వచ్చి, నామధుకలసంబు వ్రచ్చినాఁడు
నామధువు పాఱఁబోసె సన్న్యాసవిబుధ
బ్రువుఁడు నావంటి విప్రుని మోసగించె.

720

నీవు నామధుకలశంబు నేలఁ బగులఁ
గొట్టి, మధువంతయును నేలఁ బెట్టినావు
నామనోవ్రణమును రేపినావు నే నిఁ
కీశ్వరునిఁ గూర్చి మొరనిడ నేఁగుచుంటి.

గద్య

ఇది శ్రీయైస్లామిక ఖాదరియా గోత్రపవిత్ర మదీన్ కబీర్ గురువంశ

పయః పారావార రాకాసుధాకర మహర్షి మొహియదీన్ బాద్షా

చాన్బియాంబికా గర్భశుక్తిముక్తాఫల చతుర్విద సంస్కృ

తాంధ్ర నానాపాశ్చాత్య పారశీకాంగ్ల భాషా కూలంకష

మహాపండిత కవి మౌలవీబిరుదాంకిత శతాధిక

కావ్యవిరచన శతావధానాది కళానిపుణాఖిల

భారత శాసన మహా సభా సభ్యా

ధ్యాత్మిక విద్యాపీఠాచార్య ఉమర్

అలీషా క వ్యాంధ్రీకృత

"ఉమర్ ఖయ్యామ్"

పారశీక మహా

కావ్యము

సంపూర్ణము