పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/589

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వార త్రియామాదియై రహిన్ గను సమ- | యంబున నమలాపురాన్వయామృ-
తాంభోధిరాకాసుధాంశుండు నాఁగ ను- | ద్భవమంది మదిని సద్భక్తి మెఱయన్.


పై పద్యమువలనఁ గవి జన్మమొందిన కాలము పైని మేముదాహరించినటుల స్పష్టమగుచుండ, శతకకవుల చరిత్రమునందు వంగూరి సుబ్బారావుగారును, ద్వితీయశతకసంపుటమున లచ్చారావుగారును ఈ కవి శాలివాహనశకము 1682 సరియగు కీ. శ. 1760 లో మృతినొందినటుల వ్రాయుట కేది యాధారమో తెలియదు.

ఈ సన్యాసికవి కంత్యనియమాదులయం దభిరుచి మెండు. ఇంతవఱ కీ కవిశతకములలో నైదాఱు మాత్రమే లభించినవి. ఈయన వ్రాసిన గ్రంథము లెన్ని కలవో యవి యెందు గలవో విశాఖపట్టణమండలవాసులు శోధించి ప్రచురించుట కర్తవ్యము.

తండయార్పేట,

ఇట్లు

చెన్నపట్నం.

వావిళ్ల. రామస్వామిశాస్త్రులు

26. 1. 1926.

అండ్ సన్స్