పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గొట్టుముక్కల రాజగోపాలశతకము

183


పొలుపొందన్ గృపచే సమస్తవిభవంబుల్ దేవకీగర్భశం
ఖలసన్మౌక్తిక గొట్టు...

78


మ.

స్ఫుటసద్భక్తియుతాత్ముఁ డైనబహుళాశ్వున్ నిత్యసత్యవ్రతో
ద్భటు రాజర్షిని గాంచి పూజగొని తద్భావఁబునన్ నీవు ప
ర్యటనంబందితివౌర సన్మునిమనీషారామ విస్ఫూర్తిసం
ఘటనాచైత్రిక గొట్టు...

79


మ.

అకలంకస్థితి తల్లి వేఁడిన వరం బాలించి పాతాళలో
కకృతావాసుల తన్మృతార్భకుల వేడ్కన్ దెచ్చు సద్యఃకృపా
ర్థికులన్ మిమ్ము భజింతు పార్థశుభకృద్గీతారహస్యప్రసం
గకళాబోధక గొట్టు...

80


మ.

కుహనామౌనిత వచ్చి యాదవులగైకోకన్ సుభద్రన్ మహా
మహుఁడై చేకొనిపోవునర్జునుని సన్మానించు నీ సౌహృదం
బహహా! యెన్నఁదరంబె హంసడిభకాన్యోన్యఘ్నతాహేతువి
గ్రహసృణ్మాయిక గొట్టు...

81


మ.

అబలాగర్భము గావబూని గాయన్ లేమికిన్ రోసి బా
డబు డెగ్గాడిన మాన్పి తత్సుతులజాడల్ జూపి సత్కీర్తినొం
దబడెన్ పార్థుఁడు నీసహాయపటిమన్ దైత్యఘ్నతోదృష్టవి
క్లబబృందారక గొట్టు...

82