పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉద్దండరాయశతకము

159


భుజపత్రద్రువు లారసాలతరు లాపున్నాగముల్ వీచియు
మ్మజనం జల్లనిసేవ సేయుటనై మద్దాలి...

73


మ.

ప్రజలె ట్లట్లుగ నీవు గోపికలు బెంపన్ సొంపు గైకొంటకే
భజనల్ జేసినపుణ్యమో గృహవనీప్రాంచజ్జపాకుందహే
మజయాజాతిలవంగలుంగములకున్ మద్దాలి...

74


మ.

వ్రజడింభఛ్ఛటఁ గూడి నీ వడవిత్రోవం బోవుచో దర్భగు
ల్భజముల్ నీపదపద్మముల్ తమపయిం బర్వం బవిత్రస్వనా
మజగత్సార్థము లౌట కేసుకృతమో మద్దాలి...

75


మ.

గజనిమ్మల్ సురపొన్నలుం బనసలుం గన్నేరులున్ మున్నుగాఁ
గుజముల్ గాన; సవల్లవీకభవదంఘ్రల్ దోహదాచారధ
ర్మజసంభావనఁ గాంచనోచుట హహా మద్దాలి...

76


మ.

రజనీచారుఁడు సీతఁ గొందు జన తద్రక్షఃపతిన్ దాఁకి వీఁ
క జటాయుఃఖగ మీల్గె నీకొఱకుఁ దత్కాయంబు సంగ్రామక
ర్మజితంబౌటకు నెంతపుణ్యఫలమో మద్దాలి...

77


మ.

నిజవిత్తంబులు సార్థకంబులుగ నిన్ సేవించి యర్పించి యిం
పు జనింపన్ జరియించుపుణ్యులకుఁ దత్పుణ్యంబు నీ రెత్తుని