పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉద్దండరాయశతకము

147


రజగేహైకకళత్ర భవ్యగుణపాత్రా నన్నికన్ నీచక
ర్మజడత్వంబులఁ బాపి ప్రోవఁగదె శ్రీమద్దాలి...

9


మ.

ద్విజరాజధ్వజ దివ్యవందిత సదాదేదీప్యమానాత్మ దే
వ జగన్నాథ ముకుంద మాధవ హరీ వందారుమందార న
మ్మఁ జనున్ నిన్ను దయామయాత్ముఁడవయా మద్దాలి...

10


మ.

గజరాడ్రక్షక నాకుఁ గన్పడవె నే గన్గొందు నీపాదపం
కజముల్ నీవదనారవిందమును నీకన్దమ్ములుం గామసో
మజయంతాదుల గేరుచక్కదనమున్ మద్దాలి...

11


మ.

రజతక్ష్మాధరగేహసాయక భవద్రాజత్ప్రభావంబు ల
క్కజముల్ ద్రౌపదియార్తిచే సరసిజాక్షా యన్న మాత్రానఁ బ్రే
మ జిగుళ్లొత్తఁగ మానము న్నిలిపితౌ మద్దాలి...

12


మ.

అజహత్ప్రాభవ తెల్పవే స్మృతి యవిద్యారూపపుంజీనువా
లు జొరం దృష్టికి సంతరంబిడదు తల్లోపంబు లేకున్న భీ
మజరాయుఃగ్రథనంబు జీవున కగున్ మద్దాలి...

13


మ.

విజయక్షేమదనీదయంగద జయావిర్భూతిసంసారప
క్షజపంకాంబుధు లింకిపోవుటకు నీసంసేవ పేరింటి గ్రీ