పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

దిట్టకవి రామచంద్రకవికృత

ఉద్దండరాయశతకము

మ.

అజకాంతన్ భజియించి భాగవతులం బ్రార్థించి డెందంబునన్
గజవక్త్రుం బ్రణుతించి తొంటికవులం గైవారముల్ చేసి ప్రే
మ జొహా రటంచు సాగిలి యెదన్ మద్దాలి యుద్దండరా
య! జయ శ్రీసువిధేయ! భక్తజనగేయా! నిత్యభాగ్యోదయా.

1


మ.

త్రిజగత్పూజ్యము లైన నీపదము లర్థిగా సేవ గావింతు నిన్
భజియింతున్ నిరతంబు మ్రొక్కుదు మది భావించి కీర్తింతు సా
మజసంరక్షక విశ్వకారక హరీ మద్దాలి...

2


మ.

భుజముల్ ఫాల మురంబు చేతులు పదంబుల్ భూమి మోయంగ సా
గి జలూకాగతిచేఁ బ్రణామశతముల్ గీలింతు గైకొమ్ము ప్రే
మ జెలంగ౯ భవదీయదాసుఁడఁ జుమీ మద్దాలి...

3