ఈ పుట ఆమోదించబడ్డది
అంకితము
కష్ట సుఖములందు ♦ కలిమిలేములయందు
మించునెయ్యమునను ♦ మెలఁగుచుండి,
పగలు రేయి యనక ♦ బ్రదుకు చావు ననక
మఱపులేనిప్రేమఁ ♦ బఱపుచుండి;
అవనిసుఖము కొంద ♦ ఱందుచు నున్నారు,
కొంద ఱమిత బాల్య♦మందె చనిరి;
అట్టి నాయనుజుల ♦ కనుఁగుఁజెల్లెండ్రకు
నంకితంబు సేతు ♦ నధికప్రేమ.