పుట:2015.373190.Athma-Charitramu.pdf/449

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46. వీరేశలింగముగారి సాయము 411

సిద్ధము చేయించుట. నాకును తక్కిన యుపాధ్యాయులకును నసమ్మతముగ నుండెను. పాఠశాలలో జరుగుచుండెడి దుర్నయములను గుఱించి నే నొక పెద్దయుత్తరము వ్రాసి, అనంతముగారికి 18 వ జూలయిని బంపితిని. ఆరోజునను మఱునాఁడును జబ్బుగా నుండుట చేత నే నింటనే యుంటిని. మిత్రులతోఁ గలసి యొకసాయంకాలమున ననంతముగారు నన్నుఁ జూడవచ్చి, కాలనిర్ణయ పట్టికను నన్నుఁ దయారుచేయు మనిరి. నే నందుకు సమ్మతింపనందున, సరియైన యేర్పాటులు జరుగకుండుటకు నేనే కారణముగదా యని వారనిరి ! కాని, యందఱియెదుటను నేను నిజము విప్పిచెప్ప సాహసింప కుంటిని.

క్రొత్తయేర్పాటులచొప్పున పాఠశాలలో నాకుఁ బని హెచ్చి తీఱిక తక్కువ యయ్యెను. నా దేహమున నిటీవల నసిగా నుండుటలేదు. సంవత్సరముల కొలఁది వార్తాపత్రికల పనులు చేయుటకు నే నెంతయు విసిగియుంటిని. 1901 వ సంవత్సరము జూను 'జనానాపత్రిక'లో స్వవిషయము అను శీర్షికక్రింద నే నిట్లు వ్రాసితిని : - "ఈ పత్రికతో మా 'జనానాపత్రిక' కెనిమిది సంవత్సరములు గడచినవి. జూలయినెలలో 9 వ సంవత్సరము ప్రవేశ మగును. * * * ఇంగ్లీషుమాసపత్రిక లెంత చక్కఁగ నుండునో చూడుఁడు ! వేల కొలఁది చందాదారు లుండుటచేతనే యాపత్రికలు చౌకగ నమ్మఁబడు చున్నవి. అందలి విషయములు బొమ్మలును రమ్యముగ నుండును. మనదేశమం దన్ననో, పత్రికాధిపతి తన తీఱిక కాలమును, సొమ్మును పత్రిక కుచితముగ నీయవలసినదే ! పత్రికకు వ్యాసములు వార్తలు మున్నగునవి ముఖ్యముగ నాతఁడే వ్రాయవలయును. ఇతరు లతనికి సాయము చేయరు ! పత్రికలను చందాదారుల కంపుట, ఉత్తర ప్రత్యుత్తరములు నడుపుట, సొమ్ము వసూలు చేయుట, మొదలగు