పుట:2015.373190.Athma-Charitramu.pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

37. న్యాయవాది పరీక్ష 371

బోయి, నగ యిచ్చివేయు మనియు, లేనిచో చిక్కులలోని కది వచ్చుననియుఁ జెప్పివేసితిమి. నగసంగతి తనకుఁ తెలియదని యపుడు చెప్పినను, మఱునాఁ డాస్త్రీ మావస్తువు మాకిచ్చివేసెను.

26 వ జనవరి దినచర్యయం దిట్లుండెను : - "పాఠాశాలాధికారి క్లార్కుదొర వచ్చుటచేత నేను తమ్ముఁడును న్యాయశాస్త్ర పరీక్షలకుఁ జెన్న పురి బయలుదేఱలేక పోయితిమి. సాయంకాలము పాఠశాలలో నుపాధ్యాయులసభ జరిగెను. బోధకులు దినమున కైదు గంటలు విద్యాలయమునఁ బని చేయవలయు ననియు, అట్లు చేయనొల్లనివారు పాఠశాల వదలిపోవలయు ననియును, క్లార్కుదొర సగర్వముగ సేనానివలెఁ జెప్పి వేసెను ! భారతదేశవిముక్తికొఱకు పాటుపడెడి క్రైస్తవమత ప్రచారకులపద్ధతు లిట్టివి ! ఓ జీససా, నీయనుచరుల చర్యలనుగూర్చి యశ్రువులెట్లు నీకనుగవనుండి యొల్కుచున్నదో కద !"

27 వ జనవరిని తమ్ముఁడు నేనును మద్రాసు బయలుదేఱితిమి. రెయిలులోకూడ మే మిరువురమును పరీక్షాపుస్తకములు తిరుగవేయుచుంటిమి. అంతకుముందె తెనాలిమీఁదుగ మధ్యమార్గమున రెయిలుచెన్న పురి పోవ నారంభించెను. కావున మఱునాఁడు ప్రొద్దునకే రాయపురము చేరితిమి. మిత్రుఁడు ములుకుట్ల సూర్యప్రకాశరావుగారు తిరువళిక్కేణిలో తమ బసయొద్ద మా కొకగది కుదిర్చి పెట్టిరి. 29 వ తేదీనుండి పరీక్షలు జరిగెను. మొదటి పరీక్షాపత్రము నందఱివలెనే నేనును పాడుచేసితిని. 2 వ ఫిబ్రవరితో పరీక్ష ముగియఁగా, తల తడివి చూచికొంటిని ! మంత్రిరావు వెంకటరత్నముతో మే మిరువురమును, పార్థసారథికోవెలను దర్శించితిమి. మఱునాఁడు ఫ్లెచ్చరు విలియమ్స్‌దొర యొసంగిన 'షేక్స్‌పియరును' గుఱించిన యుపన్యా