పుట:2015.373190.Athma-Charitramu.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

29. పితృనిర్యాణము 335

ననెడియాశ యిప్పటికిఁ దొలఁగిపోయెను ! 20 వ తేదీని తల్లి దండ్రులను సోదరులను విడువలేక విడిచి, రైలెక్కి బెజవాడ చేరితిని.

ఆ దినములలో బెజవాడపఠనాలయమున సాయంకాలము చీట్లాడుట పెద్దమనుష్యుల సంప్రదాయమయ్యెను. ఇది నాకును తక్కిన సంస్కారపరులగు మిత్రులకును సరిపడకుండెను. దీనిని నిరసించుచు నేను పత్రికలకు వ్రాసితిని. వీరభద్రరావుగా రొకప్రహసనము కల్పించిరి. మావ్రాఁతలు సభ్యులకుఁ గష్టముగాఁ దోఁచెను. మావ్యాఖ్యానము లసమంజసములని యొక బహిరంగసభలో నధ్యక్షుఁడు వాకొనియెను.

నా "గృహనిర్వాహకత్వ" మిదివఱకె ప్రకటింపఁబడినను, ముద్రితమైన మున్నూఱుప్రతులును వేగమె విక్రయమగుటచేత, కొన్నిమార్పులు చేసి, రెండవకూర్పునకు పుస్తకమును మద్రాసుపంపితిని. కాని, సొమ్మునుగుఱించిన చిక్కులవలన, అచ్చుపని యాఁపుఁడని నేను అక్టోబరు 5 వ తేదీని తంతి నంపినను, ముద్రాలయాధిపతి పుస్తక ముద్రణము మానివేయలేదు.

ఆకాలమునందు నాగ్రంథపఠనవైపరీత్యము నా దినచర్యపుస్తకమందలి యీక్రిందియుల్లేఖమువలనఁ దెలియఁగలదు : -

"1898 అక్టోబరు 6 గురువారము: 'లండనునగర రహస్యముల'లోను, కార్లయిలుని 'భూతవర్తమానముల'లోను కొన్ని పుటలు చదివితిని. 'మార్కసు అరీలియసునిమననములు,' 'సెనీకానుండి యుల్లేఖనములు' అనుపుస్తకములు చదువఁ దీసికొంటిని. ఉత్కృష్టములు నికృష్టములునగునిట్టి పరస్పరవిరుద్ధ విషయములను సమానప్రేమమున నాయాత్మ క్రోలుటకుఁ గారణము తెలియదు ! రైనాల్డ్సుని విషయవాం