పుట:2015.373190.Athma-Charitramu.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17. "ప్రత్యక్ష భగవత్సందర్శనము" 287

పఱచుచున్నాను : - "ప్రార్థనసామాజికులకు దైవమే మతము. ఆయనను హృదయదర్పణమందును, ప్రకృతిముఖమునను సందర్శింపనగును. నిజమగు భక్తునికి, ఈశ్వరుఁడు తప్ప వేఱు స్వర్గమోక్షము లెవ్వియు లేవు! భగవత్సందర్శనమే భక్తుని పెన్నిధానము ! అట్టి భగవంతుని సూటిగనే మనము గ్రహింపనగును. మనుష్యుని మనస్సీమ ననేక లోపపాపములు పీడించుచున్నను, మనము దేవుని తిన్నగనే దర్శింపఁగలము. గ్రంథములు, గురుసహాయము మున్నగు పరికరములు భక్తునికిఁ గావలసియున్నను, అవి యెన్నఁడును దేవునిస్థానముమాత్ర మాక్రమింపలేవు. తన మహిమాధికారములు అవతారవిగ్రహాదులకు వదలి వైచినదేవుఁడు, దూరస్థదైవమే ! అట్టిదేవుఁడు మనుజుని జ్ఞానచక్షువునకును దూరస్థుఁడే. ఆదేవునికిని నాస్తికవాదుల కెఱుకఁబడనట్టియు, ఎఱుఁగరానట్టియు నీశ్వరునికిని భేదము లేనేలేదు ! సత్యదైవ మెపుడును మనచెంతనే పొంచియున్నాఁడు. ఇది మనుష్యకోటి కనుభవ సిద్ధవిషయమె.

"ఇట్టి భగవత్సందర్శనము ప్రజ్ఞాన్వితులకేకాని పామరజనులకు సాధ్యము గాదని యెవరైనఁ జెప్పవత్తురేమో. మనశ్శక్తులలో వ్యక్తిగత భేదము లున్నను, జ్ఞానసంపాదన విషయమునమాత్రము మనుజు లందఱు నొకకుటుంబములోనివారె. పండితపామరు లుభయులు నీశ్వరు నొక విధముగనే గ్రహింపఁగలరు. ఒకవిధముననే సాక్షాత్కారము చేసి కొనఁగలరు. ఈశ్వరసాక్షాత్కారము భక్తు లందఱికిని సుసాధ్యమగు కార్యమే."

రాజమంద్రిలో నుండు రోజులలో వీరభద్రరావుగారిని వీరేశలింగముగారి కెఱుక పఱచితిని. రావుగారి కొక ముద్రాలయము కొని పెట్టెదమని పంతులుగారు సెలవిచ్చిరి. వీరభద్రరావుగారు కొలఁది