పుట:2015.373190.Athma-Charitramu.pdf/325

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

17. "ప్రత్యక్ష భగవత్సందర్శనము" 285

నిరుడు మద్రాసులో న్యాయవాదిపరీక్షకుఁ జదివిన తమ్ముఁడు వెంకట రామయ్య ఆపరీక్షలో నపజయ మందినట్లు తెలిసి మేము విచారించితిమి. కనకరాజు రెండవ తరగతి న్యాయవాదిపరీక్ష నిచ్చుట సంతోషవార్తయే. బావమఱఁది సీతాపతిరావు మాధ్యమిక పరీక్షలోఁ దప్పిపోయెనని తెలిసెను. ఈసంవత్సరము తా నింట నూరకుండ నొల్లక వెంకటరామయ్య నలువది రూపాయిల జీతము మీఁద రేపల్లె మాధ్యమిక పాఠశాలలోని ప్రథమోపాధ్యాయ పదవిని స్వీకరించుటకు సంతోషించితిమి. ఇపుడు కుటుంబ పరిపోషణము చేయువారు, ఒకరి కిద్దఱ మగుట నా కెంతయుఁ బ్రోత్సాహకరముగ నుండెను.

మాఋణదాత పార్వతీశముగారు మామీఁద వ్యాజ్యెము వేసెనని చెప్పుటకు మాతండ్రి బెజవాడ 26 వ మార్చి తేదీని వచ్చెను. అప్పులను గుఱించి తలంచుకొనినపుడెల్ల నాకు మనస్తాపము గలుగు చుండెను. కాని, యధైర్యపడిన లాభము లేదనియు, ఎల్లకాలము చీఁకటిరాత్రులె యుండవనియు, మాతండ్రి నన్నోదార్చుచుండువాఁడు. మేముమాత్ర మట్టి సుదినములు గాంచ నోఁచుకొనలేదని నేను భయమందుచుండెడివాఁడను.

మా రేలంగి వాస్తవ్యుఁడును, ఆ దినములలో నేలూరులో "దేశోపకారి" పత్రికాధిపత్యము నెరపువాఁడును నగు శ్రీ చిలుకూరి వీరభద్రరావుగారు నన్నుఁ జూచుటకు బెజవాడ వచ్చిరి. కొలఁది కాలములోఁ దాను ముద్రాలయ మొకటి కొని నావలెనే బెజవాడలో నివసించెదనని యాయన చెప్పునపుడు నే నానందపరవశుఁడనైతిని.

రాజమహేంద్రవర ప్రార్థనసమాజ వార్షికోత్సవము వీక్షింపఁ గోరి, నేను బెజవాడనుండి 15 వ ఏప్రిలున బయలుదేఱితిని. మార్గ