పుట:2015.373190.Athma-Charitramu.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

35. రంగనాయకులు నాయుఁడుగారు 155

శ్రేయ మని వైద్యుఁడు వక్కాణించెను. అప్పటినుండియు నేను నాయుఁడుగారిని జూచుచు, వారొసఁగు మందులు సేవించుచు, కొంచెముకొంచెముగ లాభము నొందుచుంటిని

కొంతకాలమునకు రంగనాయకులు నాయుఁడుగారిని నగరవైద్యశాలలోనికి మార్పఁగా, పట్టణమధ్యమునకు వారు కాపురము వచ్చిరి. సహజసౌజన్యమహిమమున నాయుఁడుగారు శీఘ్రకాలములోనే జనానుమోదము నొందిన వైద్యు లను కీర్తిఁ గాంచిరి. దయా స్వభావు లగు వారికి ధర్మసంస్థలం దమితప్రీతి. ఆయన సద్భావయుతుఁడగు సంస్కరణాభిమాని. నాయుఁడుగారును, వారిధర్మపత్ని జానకీబాయిగారును, సహృదయులు; జీససు మహనీయునియం దధిక విశ్వాసము గలవారలును. పెరిఁగెడి సంసారబాధ్యత నౌదలఁ గలవారగుటచేత వారు బహిరంగముగ క్రైస్తవులు గాకపోయినను, సామాన్యక్రైస్తవులకంటె నెన్నిమడుంగులో ఈశ్వరభక్తి సంపన్నులును, సదాచారనిష్ఠాసమన్వితులును. పలుమాఱు తమయింటికిఁ బోయి తమతో సంభాషించుచుండు నామీఁద, ఆదంపతు లిరువురు సవ్యాజ సోదరభావము గలిగియుండిరి. నాయందలి వత్సలతచేత నాయుఁడుగారు నా బంధుమిత్రులకును దయచూపి, ఉచితవైద్యసాహాయ్య మొనరించుచుండువారు. ఆదినములలో నేను పెద్దబజారునకు వెళ్లి వచ్చునపు డెల్ల, పెద్దరస్తాప్రక్క నొకబీదముసలిది బిచ్చ మడుగుచుండెడిది. అంతకంతకు, వార్ధక్యము ముదిరి, దృష్టి తప్పి, అది కూర్చుండుచోటనుండి కదలలేకపోయెడిది ! దానికి వేవేగమే మతికూడ తప్పిపోవుచుండెను. తూష్ణీంభావులగు జనుల మధ్యమం దీనుసలి దాని దైన్యము నిస్సహాయతయును జూచినపు డెల్ల, నాగుండె నీ రగు చుండెడిది. ఈస్త్రీ సమాచార మొకటి రెండుమాఱులు నాయుఁడు