పుట:2015.373190.Athma-Charitramu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 142

సమ్మతించితిని. ఎట్టకేలకు సత్యసంవర్ధనిని సమాజపత్రికగా పంతులుగా రంగీకరించి నన్ను పత్రికాసంపాదకునిగ నిర్ణ యించిరి.

జూలై 29 వ తేదీని పత్రికమొదటిసంచిక వెలువడెను. దీనిలో, తెలుఁగున పంతులుగారును, ఇంగ్లీషున నేనును, విజ్ఞాపనము వ్రాసితిమి. 'అనుతాపము' అను వ్యాసమునకు నేనును, 'పుణ్యపాప మార్గములు' అనుదానికి పద్మనాభరాజుగారును రచయితలము. ఇవి గాక రెండు సంగ్రహవార్తలుమాత్రమే యాసంచిక యందుఁ గలవు. మచ్చునకై యీ వ్యాసములలోని కొన్ని భాగము లిచట నుల్లేఖించు చున్నాను.

(తెలుఁగు) విజ్ఞాపనము : "మన హిందూదేశమందు సమస్తమును మతముతో సంబంధించియున్నది. మతమునం దక్రమముగ ప్రవేశించిన దురాచారములను తొలఁగింప బ్రయత్నింపనిపక్షమున, మన దేశమునం దితర విషయములయం దభివృద్ధి కలిగించుట సాధ్యము కాదు. మతమే సమస్తాభివృద్ధులకును మూలాధారము మతమే నీతి వృక్షమునకు కుదురు. కాఁబట్టి సామాన్యజనులయభివృద్ధికయి మత విషయములయిన సత్యములను, నీతిని, సద్వర్తనమును బోధించెడిపత్రిక యొక్కటి యత్యావశ్యకమయియున్నది. అట్టికొఱఁతను కొంతవఱకయినను తీర్పవలె నని యిక్కడి ప్రార్థనసమాజమువా రిప్పు డీచిన పత్రికను ప్రచురింపఁబూనుకొన్నారు."

అనుతాపము : "ప్రతిదినమును తాను జేసినయపరాధముల మనసునకుఁ దెచ్చుకొని, వానికై పరితపించుటచేత, ఎవరిదుర్గణములు వారికిఁ దెలియును. లోకములో జనులకు సాధారణముగ తమ కీలోపము లున్నవని బాగుగ తెలియవు. ఒకవేళ తెలిసినను అవి యున్న వని