పుట:2015.372412.Taataa-Charitramu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాత్రలందితర దేశములనుండి తెచ్చు సుందరప్రతిమలను, విచిత్ర వస్తువులను, కొన్నిగ్రంధములను గూడ, అమర్చెను.

బొంబాయికి చుట్టుపట్ల 'జుహు, బంద్రా' సాల్సెటి, మహద్, అను చిన్నదీపములు గలవు. అందును బొంబాయికి పరిసరమందును గూడ విశాలస్థలములను గొని, అందువాసయోగ్యమైన చక్కని బంగాళాయిండ్ల నాయన కట్టించెను. ఆయన యితరదేశములందలి కట్టడములలో వేర్వేరు పంపిణీలను కనిపెట్టుచు, అందు చౌకలో చక్కగనుండువానిరీతిని తనగృహమున నిర్మించుటచే, అవి ఉత్తమములై ఇతరుల కాదర్శముగ నేర్పడెను. తరువాత నట్టివిశాలములు ఆరోగ్యప్రదములునగు భవనములను కొందరితర శ్రీమంతులు ననుకరించిరి; సామాన్యమగుజీతము ఆదాయముగలవారికి వీలగునట్లు, 'జింఖానా చాంబర్సు' అనుపేర చాలయిండ్లవరుస నాతడు కట్టించెను. ఇందు పాశ్చాత్యపద్ధతి స్నానపానాదుల సౌకర్యమేర్పర్చబడెను. ఇదినాలుగంతస్థులదై వ్యాపారస్థలముల సమీపమున చుట్టునుఖాళీస్థలముననున్నది. చాలమంది యూరపియనులిందు కాపురముందురు.

తనమిల్లులపైవచ్చు నాదాయములో కొంతభాగమును తాతాగారు భవననిర్మాణముకును వానినివృద్ధి జేయుటకును వినియోగించుచుండెను. ఆకర్షకములగు నాగృహములందెప్పుడును జనులు కాపురముండుటచే, ఆగృహములవల్లను తాతాకు మంచి ఆదాయమే వచ్చుచుండెను. కాని సౌకర్యమును బట్టి